హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు Darshan Renuka Swamy Case Notice To Chikkanna. Sakshi
Sakshi News home page

Chikkanna: దర్శన్ కేసులో మరో ట్విస్ట్.. యంగ్ హీరోకి నోటీసులు

Published Tue, Jun 18 2024 8:20 AM | Last Updated on Tue, Jun 18 2024 9:27 AM

Darshan Renuka Swamy Case Notice To Chikkanna

వ్యక్తిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. రోజురోజుకి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్. కన్నడ హాస్య నటుడు కమ్ హీరో చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలానే పోలీస్ స్టేషన్‌కి కూడా తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)

కన్నడ హీరో దర్శన్.. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజులు, వీడియోలని మొబైల్‌లో పంపడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఓవైపు విచారణ, మరోవైపు దర్యాప్తు సాగుతోంది.

అయితే హత్య జరగడానికి ముందు దర్శన్‌తో పాటు అతడి మనుషులు.. బెంగళూరు రాజేశ్వరి నగర్‌లోని స్టోనీ బ్రూక్ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నారు. దీనికి దర్శన్‌ ఫ్రెండ్, నటుడు చిక్కన్న కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ చేసుకునే టైంలో హత్య గురించి దర్శన్ ఏమైనా చర్చించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిక్కన్నకు నోటీసులు ఇచ్చారు. ఇతడికి హత్యతో సంబంధం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. కేవలం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుని వదిలేశారు.

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ అమలా పాల్.. వీడియో వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement