బిగ్‌బాస్‌ షోలోకి ఎమ్మెల్యే.. గ్రాండ్‌గా ఎంట్రీ, వీడియో వైరల్‌ | Karnataka Congress MLA Pradeep Eshwar Enters Bigg Boss Kannada 10 Show, Video Viral - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్‌గా కాంగ్రెస్‌ MLA, ముక్కున వేలేసుకుంటున్న జనం..

Oct 9 2023 5:20 PM | Updated on Oct 11 2023 1:50 PM

Controversy Over Congress MLA Pradeep Eshwar Enters Into Bigg Boss 10 Kannada In Social Media - Sakshi

ఎమ్మెల్యేను బిగ్‌బాస్‌ షోలో చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు. నియోజకవర్గానికి సేవ చేయాల్సింది పోయి హౌస్‌లో ఏం చేస్తాడట అని విమర్శిస్తున్నారు. ప్రజలకు సే

సౌత్‌లో బిగ్‌బాస్‌ సీజన్లు వరుసగా షురూ అవుతున్నాయి. గత నెలలో తెలుగు బిగ్‌బాస్‌ 7 మొదలవగా అక్టోబర్‌ 1న తమిళ బిగ్‌బాస్‌ 7 మొదలైంది. తాజాగా(అక్టోబర్‌ 8న) కన్నడలో బిగ్‌బాస్‌ 10వ సీజన్‌ మొదలైంది. అయితే ఇక్కడే ఊహించని పరిణామం ఎదురైంది. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. నియోజకవర్గానికి సేవ చేయాల్సింది పోయి రియాలిటీ షోలో పార్టిసిపేట్‌ చేశాడు. డప్పుచప్పుళ్ల మధ్య ఎంతో ఘనంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ అభివందనం చేశాడు.

బాహ్యప్రపంచంతో సంబంధాలు కట్‌
ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజవగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేను బిగ్‌బాస్‌ షోలో చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు. నియోజకవర్గానికి సేవ చేయాల్సింది పోయి హౌస్‌లో ఏం చేస్తాడట అని విమర్శిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చి హౌస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రదీప్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎమ్మెల్యేపై వ్యతిరేకత
కాగా ప్రదీప్‌ ఈశ్వర్‌.. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. మాజీ మంత్రి కె.సుధాకర్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టినందుకుగానూ అతడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి అతడు వెంటనే షో నుంచి వెనక్కు వచ్చేస్తాడా? లేదంటే హౌస్‌లోనే ఉండి గేమ్‌ ఆడతాడా? అనేది చూడాలి!

చదవండి: 49 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే! పెళ్లంటే బిజినెస్‌ డీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement