కల్కి: ఆ విజువల్‌ నా వీడియోలో నుంచే కాపీ కొట్టారు.. ఇది న్యాయమేనా? | Concept Artist Sung Cho Shared A Screenshot And Accuses Kalki 2898 AD Makers Of Plagiarism | Sakshi
Sakshi News home page

కల్కి ట్రైలర్‌పై కాపీ ఆరోపణలు.. సాక్ష్యం చూపిస్తూ వాపోయిన ఆర్టిస్ట్‌

Published Thu, Jun 13 2024 7:23 PM | Last Updated on Thu, Jun 13 2024 7:39 PM

Concept Artist Sung Cho Shared A Screenshot And Accuses Kalki 2898 AD Makers Of Plagiarism

కల్కి సినిమాకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటించాడు. కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మించారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కు అద్భుత రెస్పాన్స్‌ వచ్చింది.

కల్కి ట్రైలర్‌.. కాపీ కొట్టారా?
అదే సమయంలో కల్కి సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదికగా చిత్రయూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు. సౌత్‌ కొరియాకు చెందిన సంగ్‌ చై.. కాన్సెప్ట్‌ డిజైనర్‌గా హాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాలకు పని చేశాడు. తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కల్కి యూనిట్‌ తన ఆర్ట్‌ను కాపీ కొట్టిందని పేర్కొంటూ అందుకు తగ్గ సాక్ష్యాన్ని సైతం పొందుపరిచాడు. 

పదేళ్ల క్రితమే ఆ డిజైన్‌
పదేళ్ల క్రితం తను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన విజువల్‌ ఫోటోను.. కల్కి ట్రైలర్‌ ప్రారంభంలోని ఓ విజువల్‌ స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్‌ చేశాడు. ఒకరు కష్టపడి తయారు చేసిన ఆర్ట్‌ను దొంగిలించడం అనైతికం అని క్యాప్షన్‌ జోడించాడు. తర్వాత కాసేపటికి ఆ క్యాప్షన్‌ తొలగించి కల్కి సినిమా, వైజయంతి మూవీస్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు. ఆ రెండు ఫోటోలు చూసిన నెటిజన్లు ఇలా కాపీ కొట్టారేంటని ఆశ్చర్యపోతున్నారు. నీ వర్క్‌ దొంగిలించారని ఇట్టే తెలిసిపోతుంది. ఆ నిర్మాతలు ప్రభాస్‌ లుక్‌ లీక్‌ చేసినందుకే వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీపై దావా వేశారు. నువ్వు కూడా నీ ఆర్ట్‌ కాపీ కొట్టారని కోర్టుకు వెళ్లు అని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు.

కల్కి యూనిట్‌పై విమర్శలు
'ట్రైలర్‌లోని ఫస్ట్‌ విజువలే కాపీ కొట్టింది వేశారంటే వాళ్లను ఏమని అనాలో అర్థం కావడం లేదు.. ఇంకా ఇలా ఎన్ని కాపీ కొట్టారో..', 'ఇది నిజంగా బాధాకరం, కనీసం ఒరిజినల్‌ ఆర్టిస్టులకు క్రెడిట్‌ ఇచ్చినా బాగుండేది', 'ఈ సినిమా ఫ్లాప్‌ అవ్వాలి' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి నిర్మాత ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి!

 

 

 

చదవండి: స్టార్‌ హీరో కుమారుడి సినిమాను బ్యాన్‌ చేయాలంటూ ట్విటర్‌ వార్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement