Watch: Comedian Ali Daughter Grand Engagement Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ali Daughter Engagement : కమెడియన్‌ అలీ కూతురి ఎంగేజ్‌మెంట్‌ చూశారా?

Aug 27 2022 1:18 PM | Updated on Aug 27 2022 2:54 PM

Comedian Ali Daughter Engagement Video Goes Viral - Sakshi

కమెడియన్‌ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా అలీ కూతురు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అలీ-జుబేదా దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్దకూతురు ఫాతిమా ఇటీవలే మెడిసిన్ కంప్లీట్‌ చేసింది. త్వరలోనే ఈమె మెట్టినింట్లో అడుగపెట్టనుంది. కాగా యూట్యూబ్‌ వీడియోలతో జుబేదా సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే ఆమె ఛానెల్‌కు 5లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. తాజాగా తన కూతురి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement