అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ.. హాజరైన అగ్ర సినీ తారలు వీళ్లే! | Film Actors Attended For Ayodhya Ram Mandir Pran Prathistha Inauguration Today - Sakshi
Sakshi News home page

Stars In Ayodhya Pran Prathistha: మెగాస్టార్‌ టూ అమితాబ్..అయోధ్యలో అగ్ర సినీ తారల సందడి

Published Mon, Jan 22 2024 10:49 AM

Cinema Stars Attended For Ayodhya Pran Prathistha Inauguration Today - Sakshi

ప్రతి ఒక్క భారతీయుని కల నెరవేరుతున్న రోజు ఇది. 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణమిది. ప్రతి భారతీయుడు ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన క్షణమిది. అయోధ్యలో శ్రీరామమందర నిర్మాణం 500 ఏళ్లనాటి కల నేడు నెరవేరబోతోంది. ఇంతటి అద్భుతమైన ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి కళ్లు అయోధ్య వైపే. ఆ క్షణాలను భక్తితో ఆస్తాదించేందుకు ఇప్పటికే అయోధ్యాపురికి చేరుకున్నారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రముఖ అగ్ర సినీ తారలంతా శ్రీరామనామం జపిస్తూ అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ అద్భుతమైన మహాత్తర వేడుకను వీక్షించేందుకు వెళ్లిన సినీతారలపై ఓ లుక్కేద్దాం.

అయోధ్యకు మెగాస్టార్ దంపతులు..

టాలీవుడ్‌  మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరిన చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్‌కు అయోధ్యలో ఘనస్వాగతం లభించింది. వీరితో పాటు పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. టాలీవుడ్ హీరో సుమన్ ఇప్పటికే అయోధ్యకు బయలుదేరి వెళ్లారు.

అయోధ్యలో బాలీవుడ్ తారల సందడి

శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వీక్షించేందుకు బాలీవుడ్‌ అగ్రతారలంతా హాజరవుతున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ నానే, జాకీ ష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్ నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ, మహావీర్ జైన్, రోహిత్ శెట్టి రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్లారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, సినీ నిర్మాత మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్, సింగర్ సోనూ నిగమ్, మనోజ్ జోషి ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. 

అయోధ్యలో తలైవా

సూపర్‌ స్టార్, తలైవా రజినీకాంత్‌ సైతం ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను తిలకించేందుకు నటుడు ధనుశ్ కూడా బయలుదేరి వెళ్లారు. 
 

Advertisement
Advertisement