కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి | Chiranjeevi Sisters Vijaya Durga, Madhavi about Anjanamma | Sakshi
Sakshi News home page

అమ్మ వల్లే ఇలా ఉన్నామన్న మెగా సిస్టర్స్‌.. శ్రీజ వైవాహిక జీవితంపై చిరు కామెంట్స్‌

Mar 8 2025 7:30 PM | Updated on Mar 8 2025 7:52 PM

Chiranjeevi Sisters Vijaya Durga, Madhavi about Anjanamma

పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.

కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలంది
విజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.

అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..
ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.

శ్రీజ విషయంలో ఆమె వల్లే..
చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్‌ ఫీలింగ్‌ వస్తుంది అని నాతో షేర్‌ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.

చదవండి: కట్నంగా 40 గోల్డ్‌ బ్యాంగిల్స్‌ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్‌ కల్పన
నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి

Advertisement
 
Advertisement
Advertisement