breaking news
vijayadurga
-
విజయదుర్గ అధిపతి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
విజయమే ఇంటిపేరు.. విజయదుర్గ మరో ఘనత
నెల్లిమర్ల రూరల్: ఎక్కడో మారుమూల గ్రామం.. సాధారణ రైతు కుటుంబం..ప్రభుత్వ పాఠశాలలోనే చదువు..కానీ అసాధారణమైన లక్ష్యాలు, అచంచలమైన పట్టుదల విజయనగరం జిల్లా యువతి మీసాల విజయదుర్గను తెలంగాణ లా–సెట్లో తొలి ర్యాంక్ సాధించేలా చేశాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన విజయదుర్గ గురువారం విడుదలైన తెలంగాణ లా–సెట్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. తండ్రి మీసాల వెంకట్రావు రైతు కాగా, తల్లి రామలక్ష్మి గృహిణి. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయానికి బలమైన పునాది అయింది. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసంరామతీర్థం ఉన్నత పాఠశాలలో చదివిన విజయదుర్గ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదోతరగతిలో 568 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది అక్కడే ఆరేళ్లు బీటెక్ విద్యను పూర్తి చేసింది. చదువు అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి ఐదేళ్ల పాటు ఆ రంగంలో పనిచేశారు. ఉన్నత లక్ష్యాలే ముఖ్యమని భావించిన విజయదుర్గ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్–2కు సన్నద్ధమయ్యారు. గ్రూప్–2లో సత్తా..డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం..పట్టుదలతో కష్టపడి చదువుకున్న విజయదుర్గ 2023 ఏపీపీఎస్పీ గ్రూప్–2 నోటిఫికేషన్ పరీక్ష రాశారు. ఇటీవల ఆ ఫలితాలు విడుదల కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా చదువును కొనసాగించి న్యాయవృత్తిపై ఉన్న ఆసక్తి కారణంగా తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 పరీక్షకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ ర్యాంకు సాధించారు. పోటీ తీవ్రంగా ఉన్న పరీక్షలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆమె విజయం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన లక్ష్యం, కృషి ఉంటే ఏ నేపథ్యం నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విజయదుర్గ నిరూపించారు.న్యాయమూర్తిగా సేవలందించడమే లక్ష్యంనా విజయ ప్రస్థానంలో తల్లిదండ్రులు వెంకట్రావు, రామలక్ష్మి ప్రోత్సాహంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి శ్రావణ్ కుమార్ పటేల్ కృషి దాగి ఉంది. శిక్షణలో గురువుగా, మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపిక కావడంతో పాటు టీజీ లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాసేవతో పాటు న్యాయరంగంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించి, సమాజానికి ఉపయోగపడే న్యాయమూర్తిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. –మీసాల విజయదుర్గ -
కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి
పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలందివిజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.శ్రీజ విషయంలో ఆమె వల్లే..చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నాతో షేర్ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కల్పననా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి -
స్టార్ హీరోయిన్ రవళి కెరీర్ ముగిసిపోవడానికి కారణమిదే!
సినిమాల్లో కనిపిస్తే చాలనుకునేవారు కొందరైతే సినిమా ఇండస్ట్రీనే ఏలేయాలనుకునేవాళ్లు మరికొందరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సినీనటి విజయదుర్గ. 1987లో తన ముగ్గురు పిల్లల్ని చేతపట్టుకుని చెన్నపట్నం(ప్రస్తుత చెన్నై) వెళ్లింది. కష్టాలను లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఛాన్సులు చేజిక్కించుకుంది, విజయాలను అందుకుంది. ఆమె ఇద్దరు కూతుర్లు రవళి, హరితలు కూడా నటనారంగంలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. మా అసలు పేర్లు ఇవీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు కనకదుర్గ. మాది గుడివాడ. చెన్నైలో ఓసారి దసరా నవరాత్రులకు వెళ్లాను. అక్కడి వాతావరణం నచ్చడంతో పిల్లలను తీసుకుని చెన్నై షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించాను. అక్కడికి వెళ్లిన నాలుగు నెలలకే.. రఘువరన్ హీరోగా ఎస్పీ ముత్తరామన్ డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే కనకదుర్గ పేరిట ఓ నటి ఉండటంతో నా పేరును విజయదుర్గగా మార్చారు. నటి హరిత దంపతులు పెళ్లి సందడితో ఫుల్ క్రేజ్ తమిళంలో 15, తెలుగులోనూ దాదాపు 15 చిత్రాలు చేశాను. నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్గా చేసింది. పొట్టిగా ఉందంటూ తనకు సిస్టర్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం తను బుల్లితెరపై రాణిస్తోంది. ఆ తర్వాత నా కొడుకు విజయ్ (అసలు పేరు శేషు) హీరోగా ఓ సినిమా చేశాడు, కానీ అది విడుదల చేయలేదు. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి(అసలు పేరు శైలజ)కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో అందుకుంది. ఆ ప్రచారం వల్లే కెరీర్ నాశనం తన కెరీర్ ఊపులో ఉన్న సమయంలో రవళి లావైపోయిందని వార్తలు రాశారు. ఆ ప్రచారం వల్ల తన కెరీర్ నాశనమైంది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకుంది. ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నా ఆస్తి అంతా ముగ్గురికీ సమానంగా పంచాను. నా దగ్గర సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఉన్నదంతా ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
విజయదుర్గలో అరుదైన హృదయ చికిత్స
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో గుండెలో వచ్చిన లోపాన్ని కర్నూలు వైద్యులు సరిదిద్ది ఊపిరిపోశారు. ఆపరేషన్ వివరాలను శుక్రవారం శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. వసంతకుమార్ వెల్లడించారు. సాధారణంగా గర్భస్థ శిశువుకు పెద్దధమని, చిన్నధమని మధ్య డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్ ఉంటుందన్నారు. ఈ ట్యూబ్ గర్భస్థ శిశువుకు ఆరోగ్యానికి ఎంతో అవసరం అన్నారు. శిశువు గర్భం నుంచి బయటకు వచ్చాక మూడు నెలల్లో ఈ ట్యూబ్ పూడుకుపోతుందన్నారు. లేకపోతే బిడ్డకు గుండెపై ఒత్తిడి పెరిగి డొక్కలు ఎగరేయడం, బరువు తగ్గడం, సరిగ్గా తినలేకపోవడం, దగ్గు, ఆయాసం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్న కాకినాడకు చెందిన విజయలక్ష్మి(9) వారం క్రితం ఆసుపత్రికి వచ్చిందన్నారు. 2వేల మందిలో ఒకరికి ఈ సమస్య వస్తుందన్నారు. ఇలాంటి సమస్య ఉన్న వారికి గతంలో ఆపరేషన్ ద్వారా ట్యూబ్‌ను మూసివేస్తారన్నారు. కానీ విజయలక్ష్మికి ఆపరేషన్ లేకుండా డివైస్ క్లోజర్ పద్ధతిలో తొడ నరం ద్వారా గుండెకు ట్యూబ్‌ను పంపి తెరిచి ఉన్న డక్లస్ ఆర్టిరియోసిస్ ట్యూబ్‌ను సరిచేశామన్నారు. ఎన్టిఆర్ వైద్యసేవ కింద ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో బాలిక విజయలక్ష్మి, ఆమె తండ్రి ఓబులనాయుడు, అనెస్తెటిస్ట్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
విజయదుర్గమ్మా..... వానలు కురిపించవమ్మా..
– ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం – కదిలివచ్చిన భక్తజనం కడప కల్చరల్ : మాతా నమోస్తుతే....తల్లీ విజయదుర్గమ్మా.. నిండుగా వానలు కురిపించవమ్మా....మా జిల్లా పచ్చగా ఉండేటట్లు దీవించవమ్మా....సాగునీటికి, తాగునీటికి కొరత లేకుండా చూడుతల్లీ అంటూ భక్తులు శ్రీ విజయ దుర్గామాతను కోరుకున్నారు. అమ్మవారిని స్తుతిస్తూ నినాదాలు చేశారు. మంగళవారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పవిత్ర జలాలు గల 108 కలశాలతో అభిషేకించారు. 41 రోజులపాటు జిల్లాలోని అన్ని మండలాలలోగల దేవాలయాలలో ఈ కలశాలను ఉంచి పూజలు నిర్వహించారు. అభిషేకం సందర్భంగా ఆయా మండలాలకు చెందిన భక్తులు ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ ఆటోలలో ఆ పవిత్ర కలశాలను ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకొచ్చారు. జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మవారిని స్వయంగా అభిషేకించారు. బారులు తీరి వేచి ఉండి మరీ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ వేద పండితులు రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మలు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. కలెక్టర్ పూజలు.. జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ మంగళవారం శ్రీ విజయదుర్గాదేవిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి అమ్మవారి విశేష వస్త్రాలను, చిత్రపటాన్ని, గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన విజయదుర్గ కార్డియాలజీ సెంటర్ వైద్యులు ప్రత్యేకంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. -
లోక కల్యాణం కోసం ...
కడప కల్చరల్ : ‘శ్రీ విజయదుర్గాదేవీ.. జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి’ అని భక్తులు వేడుకున్నారు. ఆదివారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా విరాట పర్వ పారాయణం నిర్వహించారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మయజ్ఞ సహిత అష్టోత్తర శతకలశాభిషేక ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం చతుర్వేద హవనం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారాయణం, హోమం, మూలమంత్ర పారాయణం చేశారు. రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మ ఆధ్వర్యంలో దాదాపు 15 మంది వేద పండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకుడు దుర్గాప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.


