లోక కల్యాణం కోసం ... | Sastroktanga virata recitation... | Sakshi
Sakshi News home page

లోక కల్యాణం కోసం ...

Jul 17 2016 10:10 PM | Updated on Oct 4 2018 5:44 PM

లోక కల్యాణం కోసం ... - Sakshi

లోక కల్యాణం కోసం ...

‘శ్రీ విజయదుర్గాదేవీ.. జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి’ అని భక్తులు వేడుకున్నారు. ఆదివారం శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో శాస్త్రోక్తంగా విరాట పర్వ పారాయణం నిర్వహించారు.


కడప కల్చరల్‌ :
‘శ్రీ విజయదుర్గాదేవీ.. జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి’ అని భక్తులు వేడుకున్నారు. ఆదివారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా విరాట పర్వ పారాయణం నిర్వహించారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మయజ్ఞ సహిత అష్టోత్తర శతకలశాభిషేక ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం చతుర్వేద హవనం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారాయణం, హోమం, మూలమంత్ర పారాయణం చేశారు. రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మ ఆధ్వర్యంలో దాదాపు 15 మంది వేద పండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకుడు దుర్గాప్రసాద్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement