Chiranjeevi Released Santosh Shoban Movie Sridevi Shoban Babu Trailer, Deets Here - Sakshi
Sakshi News home page

Sridevi Shoban Babu Trailer: శ్రీదేవి శోభన్‌బాబు ట్రైలర్‌ వచ్చేసింది..

Apr 24 2022 12:45 PM | Updated on Apr 24 2022 3:13 PM

Chiranjeevi Released Santosh Shoban Movie Sridevi Shoban Babu Trailer - Sakshi

'నమస్కారం, మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాం, కథలో ముఖ్యాంశాలు.. హీరోకు నోటివాటం ఎక్కువ, హీరోయిన్‌కు చేతివాటం ఎక్కువ, వీరి మధ్య ఒక చాలెంజ్‌..' అంటూ ట్రైలర్‌ మొదలైంది. 'ఇక్కడ మాటలతో నెగ్గం బాబాయ్‌, మూటలుంటేనే నెగ్గుతాం' వంటి డైలాగులు బాగున్నాయి. ఇక తిట్ల దండకం అందుకునే హీరోకు, తిక్క లేపితే ఒక్కటిచ్చాకే మాట్లాడే హీరోయిన్‌కు మధ్య ప్రేమ ఎలా మొదలైంది?

యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌ నటించిన తాజా చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌరీ జి. కిషన్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ మధ్య సమంత టీజర్‌ రిలీజ్‌ చేయగా తాజాగా చిరంజీవి ఆచార్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. 'నమస్కారం, మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాం, కథలో ముఖ్యాంశాలు.. హీరోకు నోటివాటం ఎక్కువ, హీరోయిన్‌కు చేతివాటం ఎక్కువ, వీరి మధ్య ఒక చాలెంజ్‌..' అంటూ ట్రైలర్‌ మొదలైంది. 'ఇక్కడ మాటలతో నెగ్గం బాబాయ్‌, మూటలుంటేనే నెగ్గుతాం' వంటి డైలాగులు బాగున్నాయి.

ఇక తిట్ల దండకం అందుకునే హీరోకు, తిక్క లేపితే ఒక్కటిచ్చాకే మాట్లాడే హీరోయిన్‌కు మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అది కడదాకా నిలబడిందా? ఇంతకీ ఆ చాలెంజ్‌లో ఎవరు గెలిచారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ట్రైలర్‌ వినోదాత్మకంగా ఉందని, త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించమని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్‌. కమ్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. పోలకి విజయ్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

చదవండి: బాడీ షేమింగ్‌ చేశారు, మట్కా అని పిలిచేవారు: జెర్సీ హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement