Chiranjeevi Reached Apollo Hospital Fans Reaction Goes Viral On Social Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Charan - Upasana Konidela: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

Jun 20 2023 9:04 AM | Updated on Jun 20 2023 12:53 PM

Chiranjeevi Reached Apollo Hospital Fans Reaction - Sakshi

ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. నేడు (జూన్‌ 20)న పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది.  దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌ అందుకు వేదిక అయింది. ఇప్పటికే అక్కడకు చిరంజీవి చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్‌ కూడా సంబరాలు మొదలుబెట్టారు.  చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు.

ఇంకేముంది మెగా వారసురాలు వచ్చేసింది అంటూ.. ట్వీట్స్‌తో తమ ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫ‍్యాన్స్ పంచుకుంటున్నారు.   కొణిదెల ఇంట మూడో తరం రావడంతో ఆ బిడ్డకు  దేవుడి ఆశీర్వాదం ఉండాలని పలు దేవాలయాల్లో వారు పూజలు చేయడం ప్రారంభించారు. పండంటి బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్‌కు కూడా బ్రేక్ ఇచ్చేశాడు. తన కూతురితో ఆయన ఆనందంగా గడపనున్నారు.

(ఇదీ చదవండి: మహేష్ బాబుతో గొడవలు.. థమన్‌ రియాక్షన్‌ ఇదే)

 కంగ్రాట్స్ అన్న వదిన అంటూ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక వీడియోను అభిమానులు షేర్‌ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా అపోలో ఆస్పత్రి వద్ద హార్ట్‌ సింబల్‌లో ఉండే బెలూన్స్‌ ఎగురవేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్‌ యూనిట్‌)

Advertisement
 
Advertisement
Advertisement