'కొదమ సింహం' రీరిలీజ్‌.. ఈ రికార్డ్‌ గురించి తెలుసా? | Chiranjeevi Kodama Simham Movie Re-Release 4K Trailer Out | Sakshi
Sakshi News home page

'కొదమ సింహం' రీరిలీజ్‌.. అదిరిపోయేలా ట్రైలర్‌

Nov 13 2025 10:30 AM | Updated on Nov 13 2025 10:46 AM

Chiranjeevi Kodama Simham Movie Re-Release 4K Trailer Out

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన కొదమసింహం రీరిలీజ్‌ కానుంది. 1990లో విడుదలైన ఈ చిత్రంలో కౌబాయ్‌గా చిరు కనిపించారు. ఈనెల 21న సరికొత్త హంగులతో పాటు 4కే విజువల్స్‌తో రీరిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను షేర్‌ చేశారు. దర్శకుడు కె.మురళీమోహనరావు తెరెక్కించిన ఈ చిత్రంలో సోనమ్, వాణీ విశ్వనాథ్,రాధ,సుజాత,అన్నపూర్ణ నటించగా మోహన్‌బాబు ముఖ్యపాత్ర పోషించారు.  ఈ మూవీని కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. ఇప్పుడు కూడా ఆయనే ఈ చిత్రాన్ని 5.1 డిజిటల్‌ సౌండింగ్‌తో చేయించి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. 

ఇది 'హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ' అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణభారత చలనచిత్రంగా కొదమసింహం రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కౌబాయ్ పాత్రలని అంతకు ముందు ఎక్కువగా ఘట్టమనేని కృష్ణ పోషించేవారు. ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబట్టిన ఈ మూవీ 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఇందులోని పాటలు 'జపం జపం జపం, కొంగ జపం',  'చక్కిలిగింతల రాగం', 'గుం గుమాయించు కొంచెం' బాగా పాపులర్‌ అయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement