MegaStar Chiranjeevi Bholaa Shankar Movie Official Trailer Out Now - Sakshi
Sakshi News home page

Bholaa Shankar Movie Trailer: 'భోళా శంకర్‌' ట్రైలర్‌ రిలీజ్‌

Jul 27 2023 4:11 PM | Updated on Jul 28 2023 6:59 AM

Chiranjeevi Bhola Shankar Trailer Released Now - Sakshi

మెగాస్టార్‌  చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్‌' ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఈ ట్రైలర్‌ను నేడు జులై 27న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌  విడుదల చేశారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

(ఇదీ చదవండి: చెక్‌ బౌన్స్‌ కేసులో స్టార్‌ హీరోయిన్‌కు రూ.500 ఫైన్‌)

మొదట టీజర్‌లో  షికారుకు వచ్చిన షేర్‌నంటూ చిరంజీవి ఊర మాస్‌ డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కూడా చిరు పవర్‌ఫుల్‌ మాస్‌ డైలాగ్‌లతో రచ్చచేశాడు. 'భోళా శంకర్‌'  ట్రైలర్‌లో చిరు మాస్‌ యాక్షన్‌ సీన్లతో పాటు అభిమానులు కోరుకునే క్లాస్‌ స్టెప్‌లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా సినిమాలో మంచి టైమింగ్‌ ఉన్న కామెడీ సీన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'వేదాళం' సినిమాకు రీమేక్‌గా 'భోళా శంకర్‌' వస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement