సరికొత్త అనుభూతినిస్తుంది | Sakshi
Sakshi News home page

సరికొత్త అనుభూతినిస్తుంది

Published Fri, Jun 23 2023 3:33 AM

BVSN Prasad Talks About ASVINS Press Meet - Sakshi

‘‘తరుణ్‌ తేజతో కలిసి మా అబ్బాయి బాపినీడు హారర్‌ జోనర్‌లో ‘అశ్విన్స్‌’ సినిమా నిర్మించాడు. ఈ చిత్రం విజువల్స్, సౌండింగ్‌ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అన్నారు. వసంత్‌ రవి హీరోగా, విమలా రామన్‌ కీ రోల్‌లో నటించిన చిత్రం ‘అశ్విన్స్‌’.  తరుణ్‌ తేజ దర్శకత్వంలో బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.

ఈ సందర్భంగా తరుణ్‌ తేజ మాట్లాడుతూ– ‘‘అశ్విన్స్‌’ కాన్సెప్ట్‌తో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తీశాను. అది చూసిన బాపినీడుగారు అదే కాన్సెప్ట్‌ను ఫీచర్‌ ఫిల్మ్‌లా చేద్దామన్నారు. ప్రసాద్‌గారు, బాపినీడుగారి సహకారంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘అశ్విన్స్‌’ తరుణ్‌ కల.. దాన్ని నెరవేర్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు విమలా రామన్‌. ‘‘తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అశ్విన్స్‌’ వంటి మంచి చిత్రంతో రావటం హ్యాపీగా ఉంది’’ అన్నారు వసంత్‌ రవి.   

Advertisement
 
Advertisement