రజనీతో నటిస్తానని ఊహించలేదు, జైలర్‌ సీక్వెల్‌..: నటుడు | Vasanth Ravi Comments on Jailer Sequel | Sakshi
Sakshi News home page

Vasanth Ravi: జైలర్‌ 2లో మరోసారి..? అదే తన లక్ష్యం!

Apr 17 2024 11:56 AM | Updated on Apr 17 2024 12:37 PM

Vasanth Ravi Comments on Jailer Sequel - Sakshi

అలాగే రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం జైలర్‌లో వసంత రవి ఆయనకు కొడుకుగా ముఖ్యపాత్రను పోషించారు.

జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని నటుడు వసంత్‌ రవి పేర్కొన్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకున్నారు. చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న ఈయన ఆ తరువాత రాఖి అనే పుల్‌ యాక్షన్‌ మూవీలో నటించి సూపర్‌ హిట్‌ కొట్టారు. ఆ తరువాత అశ్విన్స్‌ అనే కథా చిత్రంలో నటించి సక్సెస్‌ అయ్యారు. అలాగే రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం జైలర్‌లో వసంత రవి ఆయనకు కొడుకుగా ముఖ్యపాత్రను పోషించారు.

రజనీతో పనిచేయడం..
అలాగే ఇటీవల అశోక్‌సెల్వన్‌తో కలిసి పొన్‌ ఒండ్రు కండేన్‌ చిత్రంలో నటించారు. జి.స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా ఏప్రిల్‌ 18న వసంత్‌ రవి పుట్టినరోజు కాగా చెన్నైలో ఆయన తన జర్నీ గురించి మాట్లాడారు. తాను మొదటి నుంచి డిఫరెంట్‌ బ్యానర్లలో నటిస్తున్నట్లు చెప్పారు. జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు.

జైలర్‌ 2లో?
తాను నటుడుగా పరిచయం అయ్యే ముందు రజనీకాంత్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నానని, అయితే ఆ తరువాత ఆయనతో కలిసి నటిస్తానని ఊహించలేదన్నారు. జైలర్‌–2 చిత్రంలో నటిస్తారా? అని అడుగుతున్నారని, వాస్తవానికి ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదన్నారు. దాని గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు.

అదే నా లక్ష్యం
అన్ని రకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాను గ్లోబల్‌ స్థాయికి చేర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రస్తుతం వెపన్‌, ఇంద్ర చిత్రాల్లో నటిస్తున్నానని, ఇవి చాలా వైవిధ్య కథా చిత్రాలుగా ఉంటాయన్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. ఇంకా మంచి చిత్రాలు చేయాలన్నదే తన కోరిక అని వసంత్‌ రవి పేర్కొన్నారు.

చదవండి: Vishal: జగన్ తప్పకుండా మళ్లీ గెలుస్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement