సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌! | kollywood Movie Weapon Ready To Release In This Month | Sakshi
Sakshi News home page

Weapon Movie: సత్యరాజ్ యాక్షన్‌ థ్రిల్లర్‌.. రిలీజ్ ఎప్పుడంటే?

May 16 2024 5:52 PM | Updated on May 16 2024 5:58 PM

kollywood Movie Weapon Ready To Release  In This Month

సత్యరాజ్, వసంతరవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్‌. మిలియన్స్‌ స్టూడియోస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎంఎస్‌ మన్సూర్‌ నిర్మించిన ఈ చిత్రానికి గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడు రాజీవ్‌ మీనన్‌ ప్రతినాయకుడిగా ఫవర్‌ఫుల్‌ పాత్రలో నటించిన ఇందులో నటి తాన్య హోప్‌ నాయకిగా నటించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రబందం ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది.

దర్శకుడు గుహన్‌ సెన్నియప్పన్‌ మాట్లాడుతూ..' సూపర్‌ హ్యూమన్‌ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్‌ సభ్యులందరు శ్రమించారన్నారు. వెపన్‌ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎస్‌ మన్సూర్, ఎంఎస్‌ అబ్దుల్‌ ఖాదర్, ఎంఎస్‌ ఐజీష్‌ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం కాదన్నారు. వారు తనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారని.. సత్యరాజ్‌ తొలిసారిగా సూపర్‌ హ్యూమన్‌ పాత్రను అద్భుతంగా పోషించారన్నారు. ఆయన అంకిత భావం, సహకారం తనను ఎంతగానో ఉత్సాహ పరిచాయన్నారు.

ఇక నటుడు వసంతరవి స్క్రీన్‌ ప్రజెంటేషన్‌ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. కాగా.. ఈ సినిమాలో యషికా ఆనంద్, రాజీవ్‌ పిళ్‌లై, మైమ్‌ గోపి, కనిక, గజరాజ్, సయ్యద్‌ సుభన్, భరద్వాజ్, రంగన్, వేలు ప్రభాకరన్, మాయా కృష్ణన్, శ్యామ్‌ కరీమ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తుండగా.. ప్రభు రాఘవ్‌ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా.. ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement