BVS Ravi Interesting Tweet on 'Baby' Movie - Sakshi
Sakshi News home page

Baby Movie: మీరు ఇడియట్స్‌, దురదృష్టవంతులు.. లేకపోతే, ఏంటి మీరు చేసింది!

Jul 14 2023 6:10 PM | Updated on Jul 14 2023 6:29 PM

BVS Ravi Interesting Tweet on Baby Movie - Sakshi

మీరు ఇడియట్సా? దురదృష్టవంతులా నాకు అర్థం కావడం లేదు. బేబీని

కొన్ని సినిమాలకు ఎంత ప్రమోషన్‌ చేసినా కంటెంట్‌ లేకపోతే ఫలితముండు. అదే కొన్ని చిత్రాలు మాత్రం ప్రమోషన్‌ చేసినా చేయకపోయినా ఫస్ట్‌ షోకే జనాలకు కనెక్ట్‌ అయిపోతుంది. ఈ మధ్య అయితే పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర డీలా పడుతుంటే చిన్న చిత్రాలు మెరుపు విజయాలు అందుకుంటున్నాయి. తాజాగా రిలీజైన బేబీ కూడా ఈ జాబితాలోకి వచ్చేట్లు కనిపిస్తోంది.

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమా జూలై 14న థియేటర్లలో విడుదలైంది. సోషల్‌ మీడియాలో ఈ సినిమాపై కొంత నెగెటివిటీ కనిపిస్తున్నప్పటికీ బయట మాత్రం పాజిటివ్‌ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా బేబీ స్టోరీకి యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారట! తాజాగా ఈ సినిమాపై దర్శకుడు, రచయిత బీవీఎస్‌ రవి ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

'మీరు ఇడియట్సా? దురదృష్టవంతులా నాకు అర్థం కావడం లేదు. బేబీని వేసవికాలంలో రిలీజ్‌ చేయాల్సింది. దర్శకుడు సాయి రాజేశ్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌.. మీరే గనక బేబీని సమ్మర్‌లో విడుదల చేసుంటేనా ఇండస్ట్రీ హిట్‌ కొట్టేవాళ్లు' అని ట్వీట్‌ చేశాడు. మరొక ట్వీట్‌లో హీరో హీరోయిన్లు ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గనిన్‌, నటుడు విరాజ్‌ అశ్విన్‌ సహా బేబీ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించాడు బీవీఎస్‌ రవి. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: బేబీ మూవీ రివ్యూ
4సార్లు జైలుకు.. 400 మందికి నాలుగే బాత్రూమ్స్‌.. నరకం చూశానన్న విలన్‌

Advertisement
 
Advertisement
Advertisement