Buttabomma Movie First Look: ఈ పల్లెటూరి బుట్టబొమ్మను చూశారా? ఎంత చక్కగా ఉందో

అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. నవంబరులో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్, మాటలు: గణేష్‌కుమార్ రావూరి.