అభిషేక్ బచ్చన్ మూవీతో ఏం చేయాలో దిక్కుతోచలేదు: డైరెక్టర్ | Bollywood Director Shoojit Sircar Open About on I Want To Talk failure | Sakshi
Sakshi News home page

Shoojit Sircar: అభిషేక్ బచ్చన్ మూవీ ఫలితంతో దిక్కు తోచని పరిస్థితి: సుజిత్

Jan 30 2025 5:01 PM | Updated on Jan 30 2025 5:49 PM

Bollywood Director Shoojit Sircar Open About on I Want To Talk failure

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గతేడాది ఐ వ్యాంట్ టూ టాక్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతేడాది నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సుజిత్ సిర్కార్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు సుజిత్ సిర్కార్‌ ఈ మూవీ పరాజయం గురించి మాట్లాడారు. ఈ సినిమా ఫలితం తనకు దిక్కుతోచని పరిస్థితి తీసుకెళ్లిందని అన్నారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు. ఐ వాంట్ టు టాక్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ థియేటర్లలో విఫలం కావడం తనను బాధించిందని సుజిత్ సిర్కార్ తెలిపారు.

డైరెక్టర్ సుజిత్ సిర్కార్ మాట్లాడుతూ.. "నా నిబంధనల ప్రకారం.. నాకు ఉన్న దృష్టితో నేను సినిమాలు తీయగలిగినంత కాలం తీస్తూనే ఉంటా. ఇలాంటి పరాజయాలు కొన్నిసార్లు  మమ్మల్ని కలవరపెడుతూనే ఉంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనే విషయం తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా. ఈ సినిమా ఫలితం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు నా సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలో చాలామంది ఆడియన్స్‌ స్పందించడం సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి చిత్రమనే నేను అనుకుంటున్నా.' అని అన్నారు.

కాగా.. సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌ ఓ ఎన్నారై పాత్రలో కనిపించారు. జీవితాన్ని మార్చే ఓ సర్జరీ చేయించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకునే ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం ఏకంగా బరువు కూడా పెరిగాడు. విభిన్నమైన పొట్టతో అభిషేక్ బచ్చన్ ఇందులో కనిపించారు.  ఈ చిత్రంలో అహల్య బమ్రూ, జయంత్ క్రిప్లానీ, జానీ లీవర్, పెర్లే డే, క్రిస్టిన్ గొడ్దార్డ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఐ వాంట్ టూ టాక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement