Bollywood Actress Urvashi Rautela Clarity On Rishabh Pant Fans Trolls On Viral Video - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: ఆ డైలాగ్ ఎవరినీ ఉద్దేశించి కాదు.. ఊర్వశి రౌతేలా క్లారిటీ..!

Oct 19 2022 1:31 PM | Updated on Oct 19 2022 5:44 PM

Bollywood Actress Urvashi Rautela Clarity On Rishabh Pant Fans Trolls On Viral video - Sakshi

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఈ భామ టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌ కోసం వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అయితే ఊర్వశి కూడా అక్కడికే చేరుకోవడంతో కచ్చితంగా పంత్‌ కోసమే వెళ్లిందంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇటీవల ఊర్వశి రౌతేలా విడుదల చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. అది కూడా పంత్‌ కోసమేనని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దానిపై క్లారీటీ ఇచ్చింది బాలీవుడ్ భామ. 

(చదవండి: స్టాకింగ్‌ అంటూ ఊర్వశిపై రిషబ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌, ఘాటుగా స్పందించిన నటి)

 తన ఇన్‌స్టా రాస్తూ..'  ఆ వీడియోపై మళ్లీ క్లారిటీ ఇస్తున్నా. అది కేవలం నటనకు సంబంధించి చేసింది మాత్రమే. అందులోని డైలాగ్ కూడా ఎవరినీ ఉద్దేశించి కాదు. అలాగే ఎలాంటి వీడియో కాల్ కాదు' అంటూ రాసుకొచ్చింది ఈ భామ. అంతకుముందు ఆ వీడియోలో ఆమె ఊర్వశి మాట్లాడుతూ..' మీరు ఐ లవ్‌ యూ చెప్పండి. ముందు మీరే ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి చెప్పండి చాలు' అంటూ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఆ వీడియోపై ఆ బాలీవుడ్ భామ ఎవరి ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చింది.  

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement