నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆమెనే: యానిమల్ బ్యూటీ కామెంట్స్ | Bollywood Actress Tripti Dimri Praises Star Heroine Priyanka Chopra, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Tripti Dimri: కేవలం అది మాత్రమే కనిపించాలి: యానిమల్ బ్యూటీ

Published Mon, Mar 25 2024 9:48 PM

Bollywood Actress Tripti Dimri Praises Star Heroine Priyanka Chopra - Sakshi

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్‌తో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌ ప్రియురాలి పాత్రలో కనిపించి మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3 చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించింది. 
 
త్రిప్తి మాట్లాడుతూ..' మరో దేశానికి వెళ్లి కెరీర్‌ ప్రారంభించాలంటే ధైర్యం  ఉండాలి. ప్రియాంకకు ధైర్యంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ ఎక్కువే. హాలీవుడ్‌కు వెళ్లి సక్సెస్‌ను సాధించింది. ఆమె నాలాంటి వారికి స్ఫూర్తి. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ప్రియాంక మూవీ బర్ఫీ మొదటిసారి చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్‌కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రతోనే మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని అన్నారు. ప్రియాంక తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని త్రిప్తి కొనియాడారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement