'క్షీణించిన బిగ్‌బాస్ విన్నర్‌ ఆరోగ్యం.. అలా జరగకూడదని కోరుకుంటున్నా' | Bigg Boss OTT 3 Winner Sana Makbul Diagnosed With Liver Cirrhosis, Comments Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sana Makbul: 'కాలేయ సమస్యతో బిగ్‌బాస్ విన్నర్‌.. అది జరగకూడదని కోరుకుంటున్నా'

Jun 13 2025 5:27 PM | Updated on Jun 13 2025 6:09 PM

Bigg Boss winner Sana Makbul Diagnosed With Liver Cirrhosis

బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ విన్నర్‌ సనా మక్బుల్‌ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. లివర్‌ సైరోసిస్‌ అనే వ్యాధితో సనా పోరాడుతోంది. ఇటీవల సనా హాస్పిటల్ బెడ్‌పై ఫోటోను పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సనా ఐదేళ్లుగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్‌తో బాధపడుతోంది. గతంలోనే చికిత్స తీసుకున్నప్పటికీ ఏమాత్రం మెరుగవ్వలేదని తెలుస్తోంది.

తన ఆరోగ్యంపై సనా మాట్లాడుతూ.. 'నేను కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్‌తో బాధపడుతున్నా. కానీ ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. నా రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా లేదు. నా కాలేయంపై దాడి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాకు  లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.  ఇమ్యునోథెరపీని ప్రారంభించానని.. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి సారించానని' ఆమె తెలిపింది.

అయితే వైద్యులు కాలేయ మార్పిడి అవసరం రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సనా తెలిపింది కొన్ని రోజులు  కష్టమైన సరే కోలుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇది అంత సులభం కాదని.. కానీ నేను అంత తేలికగా వదిలిపెట్టనని సనా మక్బుల్ అన్నారు.  ప్రస్తుతం నెమ్మదిగా నడుస్తున్నానని తెలిపింది. ఈ పరిస్థితి తనను శారీరకంగా, మానసికంగా  ప్రభావితం చేసిందని చెప్పింది.

కాగా.. సనా మక్బుల్ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్-3 విన్నర్‌గా నిలిచింది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, మామ ఓ చందమాల చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement