మణికంఠ కుళ్లు జోకులు.. రోహిణి వార్నింగ్‌.. | Bigg Boss Telugu 8: Hotel Management Task in BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: మళ్లొచ్చిన హోటల్‌ టాస్క్‌.. మణికంఠ సెటైర్లపై రోహిణి సీరియస్‌

Oct 9 2024 7:20 PM | Updated on Oct 9 2024 8:24 PM

Bigg Boss Telugu 8: Hotel Management Task in BB House

బిగ్‌బాస్‌ షోలో 'హోటల్‌ టాస్క్‌' ఎవర్‌గ్రీన్‌. ఇప్పుడా టాస్కునే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈసారి ఓజీ(ఓల్డ్‌ కంటెస్టెంట్స్‌) టీమ్‌ను హోటల్‌ స్టాఫ్‌గా, రాయల్‌ టీమ్‌ (వైల్డ్‌ కార్డ్స్‌)ను ఆ హోటల్‌కు వచ్చే అతిథులుగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ ఒక్కో పాత్ర ఇచ్చారు. గంగవ్వ రాజవంశానికి చెందిన మహారాణి కాగా అవినాష్‌-రోహిణి లవ్‌ బర్డ్స్‌.

ఫన్‌ టాస్క్‌
తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో అయితే అవినాష్‌, రోహిణి, యష్మి పర్ఫామెన్స్‌లో రెచ్చిపోయారు. డబ్బు కోసం స్టాఫ్‌ పడే తంటా అంతా ఇంతా కాదు. రాయల్‌ టీమ్‌ సభ్యులు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు కానీ ఒక్క రూపాయి కూడా విదల్చడం లేదు. అయినా సరే హోటల్‌ సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.

(చదవండి: దమ్ము కొట్టిన విష్ణు ప్రియ.. సోనియా చెప్పింది తన గురించేనా?)

నువ్వో మాడిపోయిన కందిపప్పు
చివర్లో రోహిణి.. తన అభిప్రాయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అరిచేసింది. దీంతో మణికంఠ.. నువ్వో మాడిపోయిన కందిపప్పు.. మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్‌ వేశాడు. ఈ కామెంట్‌పై చిర్రెత్తిన రోహిణి.. నీ క్యారెక్టర్‌లో నుంచి బయటకు వచ్చి నచ్చినట్లు మాట్లాడేందుకు ఇది ఫన్‌ కాదు అని సీరియస్‌ అయింది. మరి ఇది నిజమైన గొడవేనా? ప్రాంకా? అనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేదాకా ఆగాల్సిందే!

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement