రైతు బిడ్డ అని చిన్న చూపా? ఆ వల్గర్‌ మాటలేంటి?: సీరియల్‌ బ్యాచ్‌పై అఖిల్‌ ఫైర్‌ | Bigg Boss Telugu 7: Akhil Sarthak Support To Pallavi Prashanth; Video Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ప్లాన్‌ ప్రకారం మూకుమ్మడిగా టార్గెట్‌.. రైతుబిడ్డకు సపోర్ట్‌గా అఖిల్‌ సార్థక్‌

Published Wed, Sep 13 2023 3:15 PM

Bigg Boss Telugu 7: Akhil Sarthak Support Pallavi Prashanth - Sakshi

 Akhil Sarthak - Pallavi Prashanth: బిగ్‌బాస్‌ హౌస్‌లో రెండో వారం నామినేషన్స్‌ ఓ రేంజులో జరిగాయి. అయితే చాలామంది మూకుమ్ముడిగా పల్లవి ప్రశాంత్‌ను నామినేట్‌ చేశారు. వారు చెప్పే కారణాలు, మాటలు చూస్తుంటే ఇదేదో పకడ్బందీ ప్లాన్‌లాగే అనిపించింది. చివరకు అదే నిజమైంది. ముందురోజు రాత్రే ప్రశాంత్‌ను కలిసికట్టుగా నామినేట్‌ చేయాలని సీరియల్‌ బ్యాచ్‌ డిసైడ్‌ అయింది. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్‌ నెట్టింట వైరలవుతోంది. 

నోరు జారిన అమర్‌..
రైతు బిడ్డ అని చెప్పుకోవడం ఆపాలని ఆర్డర్లు, గత బిగ్‌బాస్‌ షో సీజన్లు చూసి వచ్చావని విమర్శలతో అతడిని టార్గెట్‌ చేసింది. అయినా గత సీజన్లు చూస్తే తప్పేంటి? పోనీ వీళ్లెవరైనా చూడకుండా వచ్చారా? అంటే అదీ లేదు.. ఇలా అర్థంపర్థం లేని వాదనలు, విమర్శలతోనే నామినేషన్‌ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో అమర్‌దీప్‌ అరేయ్‌, రా.. అంటూ కాస్త హద్దు దాటి మాట్లాడాడు. కానీ ప్రశాంత్‌ మాత్రం బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉన్నా.. నోరు జారలేదు. అన్న అంటూనే మర్యాద ఇచ్చాడు.

రైతు బిడ్డకు అఖిల్‌ సపోర్ట్‌
తాజాగా ఈ వ్యవహారంపై బిగ్‌బాస్‌ రన్నర్‌ అఖిల్‌ సార్థక్‌ స్పందించాడు. పల్లవి ప్రశాంత్‌కు అందరూ భయపడ్డారు, అందరూ అతడిని టార్గెట్‌ చేశారు. రైతు బిడ్డ నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు. ఆర్టిస్టులమైన మనకే బిగ్‌బాస్‌ అంటే ఎంతో ఎగ్జయిట్‌గా ఫీలైతాం. ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడతాం. అలాంటిది ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అతడు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంబరపడ్డాడు. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. లవ్‌ ట్రాక్‌తో కామెడీ చేయాలనుకున్నాడు.. కానీ అది కరెక్ట్‌ కాదు.

అతడి గురించి రీసెర్చ్‌ చేసి మరీ వచ్చారు!
అయినా సరే హౌస్‌లో  ఉన్న అందరిలాగే ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించాడు. అందులో తప్పేం ఉంది. కొందరైతే పల్లవి ప్రశాంత్‌ గురించి అధ్యయనం చేసి మరీ వచ్చారు. కానీ అతడు మిగతా కంటెస్టెంట్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. తన ఆట తను ఆడేందుకు వచ్చాడు. నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్‌ను చూస్తే బాధేసింది. ఎవరూ అతడిని మాట్లాడనివ్వడం లేదు. పైగా కొందరు అరేయ్‌, రా.. అంటూ వల్గర్‌గా మాట్లాడారు. అతడు ఒక రైతు అని చులకన చేస్తున్నారా? చాలా చిన్నచూపు చూస్తున్నారనిపించింది. అందరూ తనను డామినేట్‌ చేస్తున్నారు.

అది కరెక్ట్‌ కాదు
ఉల్టాపుల్టా నామినేషన్స్‌ అంటే అందరూ మాట్లాడతారు కానీ అతడిని మాత్రం మాట్లాడనివ్వరన్నమాట! వాళ్లు చెప్పే పాయింట్స్‌ కరెక్ట్‌.. కానీ అతడిని మాట్లాడనివ్వకపోవడం అస్సలు కరెక్ట్‌ కాదు. ఇక్కడ ఇంకో విషయం.. అన్ని సీజన్లు చూసి వచ్చాడు అంటున్నారు. హౌస్‌లో ఉన్నవాళ్లు కూడా కచ్చితంగా గత సీజన్లు చూసే ఉంటారు. ఎందుకంటే బిగ్‌బాస్‌ షో అంటే అందరికీ ఇష్టం. అసలు షో చూస్తే తప్పేంటి? వీళ్లందరూ ఫుటేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సీజన్‌ నిజంగా ఉల్టా పుల్టా.'. అని ఫైర్‌ అయ్యాడు అఖిల్‌.

చదవండి: సమాధి దగ్గరే నిద్ర.. అక్కడే కూతురితో ఆటలు.. ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడని హీరో

Advertisement
Advertisement