గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు! | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: గీతూకు నాగ్‌ క్లాస్‌.. మీమ్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు

Published Sat, Oct 29 2022 8:55 PM

Bigg Boss Telugu 6: Memes And Satires On Geetu Royal - Sakshi

నాకంటే తోపులెవరూ లేరిక్కడ అని బిగ్‌బాస్‌ హౌస్‌లో చెలరేగిపోయింది గీతూ. ఫిజికల్‌ టాస్క్‌ ఇస్తే గుద్దిపడేస్తానంది. తీరా టాస్క్‌(చేపల చెరువు టాస్క్‌)లో అందరికంటే ముందే ఓడిపోయింది. పోనీ సంచాలక్‌గా ఉండమంటే అక్కడ తను చెప్పేదే వేదం అన్నట్లుగా ఇష్టమొచ్చిన రూల్స్‌ పెట్టి తనూ ఆడుతూ కొందరిని టార్గెట్‌ చేసింది. అందరికీ ఆడటం చేతకావట్లేదని, తాడే ఆడిస్తానంటూ డిసైడ్‌ అయింది. కానీ చివరికి ఏమైంది. నాగార్జునతో చీవాట్లు తింది.

గుద్దిపడేస్తా అన్నావ్‌ ఏదీ నీ గేమ్‌ అని అడగడంతో తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక బిక్క ముఖం వేసుకుంది గీతూ. ఈ ప్రోమో చూసి ఫుల్‌​ ఖుషీ అవుతున్న కొందరు నెటిజన్లు.. మొన్నటి నుంచి గీతూ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాం.. నాగ్‌ తిక్క కుదర్చి లెక్క సరిచేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మీమ్స్‌, కామెంట్లతో గీతూను ఓ ఆటాడుకుంటున్నారు. అవేంటో మీరూ చూసేయండి..

Advertisement
 
Advertisement
 
Advertisement