Bigg Boss Telugu 5: Anchor Prashanthi Shocking Comments On Shanmukh: బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తుంది. ఓ ప్రముఖ ఛానల్‌లో గృహలక్ష్మీ అనే సీరియల్‌లో లాస్యగా నెగిటివ్ రోల్‌తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రశాంతి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఆమె ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ప్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.చదవండి: సన్నీని ఏకిపారేసిన దీప్తి సునయన.. స్ట్రాంగ్ కౌంటర్

ఈ క్రమంలో బిగ్‌బాస్ రియాలిటీ షో గురించి ప్రశ్నించగా.. సీజన్-5లో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ తనకు తెలుసని వారందరికి తన సపోర్ట్ ఉంటుందని తెలిపింది. 'హౌస్‌లో పెర్ఫార్మెన్స్ బాగున్న వాళ్లకు ఓట్లు వేసి గెలిపించండి.. అంతేకానీ.. గేట్ ఆడకుండా కూర్చునే వాళ్లకి బయట ఫాలోయింగ్ చూసి ఓట్లు వేయక్యండి' అంటూ పరోక్షంగా యూట్యూబర్ షణ్ముక్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేసింది.

కాగా షార్ట్ వీడియోలు, వెబ్‌సిరీస్‌లతో యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన షణ్నూ గేమ్ ఆడటంతో మిగతా వాళ్లతో పోలిస్తే అంత యాక్టివ్‌గా లేడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


చదవండి: డిసెంబర్‌లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా!
తనకంటే చిన్నవాడితో డేటింగ్.. ఓపెన్ అప్ అయిన రష్మిక


