బిగ్‌బాస్ హౌస్‌లో 'ఓ బేబీ' న‌టి? | Bigg Boss Telugu 4: Actress Sunaina Clears Air Of Participating In Show | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ 4: ఆమెకు ఎపిసోడ్‌కు ల‌క్ష‌?

Jul 28 2020 4:35 PM | Updated on Jul 28 2020 5:02 PM

Bigg Boss Telugu 4: Actress Sunaina Clears Air Of Participating In Show - Sakshi

లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు మూసివేయ‌డంతో కొద్ది నెల‌లుగా అభిమాన హీరోల నుంచి కొత్త సినిమాలు లేవు, మ‌రోవైపు షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో సీరియ‌ళ్లు కూడా మొన్న‌టివ‌ర‌కు అరిగిన టేపు రికార్డుల్లా పాత ఎపిసోడ్‌ల‌నే తిరిగి ప్ర‌సారం చేశాయి. దీంతో వినోదాన్ని కోరుకునే స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఉసూరుమ‌న్నాడు. లాక్‌డౌన్ పుణ్య‌మాని ఎప్పుడూ టైం లేద‌ని సాకులు చెప్పేవారికి కూడా బోలెడంత స‌మ‌యం చిక్కింది. కానీ దాన్ని ఎంజాయ్ చేసేందుకు సినిమాలు లేవు షికార్లు లేవు. ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ కూడా ఉంటుందో, ఉండ‌దో అనే అనుకున్నారు చాలామంది. ఈ నేప‌థ్యంలో అంద‌రి అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ స్టార్ మా యాజ‌మాన్యం బిగ్‌బాస్ 4 ప్రోమోను విడుద‌ల చేసింది. (బిగ్‌బాస్‌-4 ఎంట్రీపై తరుణ్‌ క్లారిటీ)

అప్ప‌టి నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొనేవారు వీళ్లు, కాదు కాదు వాళ్లు అంటూ సోష‌ల్ మీడియాలో ఎన్నో పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా అడ‌పాద‌డ‌పా సినిమాల్లో క‌నిపించిన న‌టి సున‌య‌న కూడా ఈ షోలో పాల్గొన‌బోతుందంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. పైగా ఒక్క‌ ఎపిసోడ్‌కు ల‌క్ష రూపాయ‌లు డిమాండ్ చేసిందని ఊద‌ర‌గొట్టారు. అయితే ఇవ‌న్నీ గాలివార్త‌లేన‌ని సున‌య‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెప్పారు. ఈ పుకార్లన్నీ ఎక్క‌డి నుంచి వ‌స్తాయో అర్థం కావ‌ట్లేద‌న్నారు. త‌న‌ను షో కోసం ఎవ‌రూ సంప్ర‌దించ‌లేర‌‌ని, ప్ర‌స్తుతం షోలో పాల్గొనాల‌న్న ఆలోచ‌న కూడా లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు మూడున్న‌రేళ్ల కొడుకు ఉన్నాడ‌ని, వాడికి ఆరు, ఏడు సంవ‌త్స‌రాలు వ‌చ్చేవ‌ర‌కు వేరే ఆలోచ‌న చేయ‌లేన‌ని చెప్పుకొచ్చారు. కాగా సునయ‌న కొన్ని టీవీ షోల‌తో పాటు, ప‌లు సినిమాలోనూ న‌టించారు. అయితే "ఓ బేబీ" చిత్రం ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. మ‌రోవైపు బిగ్‌బాస్ యాజ‌మాన్యం షోను ఆగ‌స్టు చివ‌రి వారంలో ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తోంది (బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ తండ్రిపై అత్యాచారం కేసు)

Advertisement
 
Advertisement
Advertisement