ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్‌ నటికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి

Bigg Boss Tamil Fame Yashika Anand Terrible Car Accident In Tamil Nadu - Sakshi

 Yashika Anand Car Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే యాషికా స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వల్లిశెట్టి  భవాని ఈ ప్రమాదంలో మృతి చెందారు. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాము మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


నటి యాషికా ఆనంద్ విషయానికి వస్తే.. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ఫ్యామిలీ నటి... 2016లో దురువంగల్ పత్తినారుతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్‌గా మారింది. బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top