ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అస‌భ్యంగా చూపారంటూ విమర్శలు | Bigg Boss Siri Hanumanth Movie Narasimhapuram Now Streaming Free In Youtube, Check Out More Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అస‌భ్యంగా చూపారంటూ విమర్శలు

Apr 4 2025 8:59 AM | Updated on Apr 4 2025 10:00 AM

Bigg Boss Siri Hanumanth Movie Narasimhapuram OTT Streaming Now Free

బుల్లితెర‌పై ప‌లు సీరియ‌ల్స్‌లో సంద‌డి చేసిన నందకిషోర్‌ హీరోగా నటించిన 'నరసింహపురం' చిత్రం తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. రివేంజ్ థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ సిరి హనుమంతు హీరోయిన్‌గా నటించింది. శ్రీరాజ్‌ బళ్లా  దర్శకత్వం వహించగా.. టి.ఫణిరాజ్, నందకిషోర్, శ్రీరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. సిస్ట‌ర్ సెంటిమెంట్‌కు రివేంజ్ లవ్‌ స్టోరీని యాడ్‌ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

నరసింహపురం సినిమా ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమాలో సిరి చాలా గ్లామ‌ర్  పాత్ర‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కాయి. సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్‌ కార్యక్రమంలో సిరి పాల్గొనలేదని నందకిషోర్‌ పలు విమర్శలు చేశారు.

సినిమా విడుదల సమయంలో సిరిపై నందకిషోర్‌ చేసిన కామెంట్స్‌
'తెలుగ‌మ్మాయిల‌కు హీరోయిన్ అవ‌కాశాలు ఇవ్వ‌డం అరుద‌నే చెప్పాలి. అలాంటి స‌మ‌యంలో వైజాగ్ అమ్మాయి సిరి హ‌న్మంత్‌కు క‌థానాయిక‌గా ఛాన్స్ ఇచ్చారు. మిగ‌తా సినిమాల్లాగా కాకుండా హీరోయిన్‌కు మంచి ప్రాధాన్య‌త ఉంది. ఇంత మంచి పాత్ర‌లు తెలుగువాళ్ల‌కు రావు. ఆమెను ప్ర‌మోష‌న్స్‌కు పిలిచిన‌ప్పుడు నేను రాలేను అని చెప్పింది. ట్రైల‌ర్‌లో త‌న పాత్ర అస‌భ్యంగా ఉంద‌ని, అది చూసిన‌వాళ్ల‌కు త‌న మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్ప‌డుతుంద‌ని త‌న‌కు తానే ఊహించుకుంది. దానికి, ప్ర‌మోష‌న్స్‌కు రాక‌పోవ‌డానికి సంబంధం ఏంటో నాక‌ర్థం కాలేదు. ఏదేమైనా హీరోయిన్‌గా సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రావ‌డం త‌న బాధ్య‌త‌. త‌న పాత్ర గురించి ముందు ఒక‌లా చెప్పారు కానీ త‌ర్వాత వేరేలా చూపించారని ఆమె ఫీలైంది. కానీ ఒక‌సారి సిరి సినిమా చూస్తే ద‌ర్శ‌కుడు త‌న‌ను ఎంత బాగా చూపించాడో అర్థం అయ్యేది. నాకు తెలిసి ఆమె ఇప్ప‌టికీ సినిమా చూసి ఉండ‌దు, చూస్తే మాత్రం త‌న అభిప్రాయం మారొచ్చు' అని నంద కిషోర్‌ చెప్పుకొచ్చాడు. అయితే, సిరి మాత్రం బదులుగా తన నుంచి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement