breaking news
Nand Kishor
-
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
బుల్లితెరపై పలు సీరియల్స్‌లో సందడి చేసిన నందకిషోర్ హీరోగా నటించిన 'నరసింహపురం' చిత్రం తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంతు హీరోయిన్గా నటించింది. శ్రీరాజ్ బళ్లా దర్శకత్వం వహించగా.. టి.ఫణిరాజ్, నందకిషోర్, శ్రీరాజ్ సంయుక్తంగా నిర్మించారు. సిస్టర్ సెంటిమెంట్‌కు రివేంజ్ లవ్ స్టోరీని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.నరసింహపురం సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమాలో సిరి చాలా గ్లామర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కాయి. సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ కార్యక్రమంలో సిరి పాల్గొనలేదని నందకిషోర్ పలు విమర్శలు చేశారు.సినిమా విడుదల సమయంలో సిరిపై నందకిషోర్ చేసిన కామెంట్స్'తెలుగమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వడం అరుదనే చెప్పాలి. అలాంటి సమయంలో వైజాగ్ అమ్మాయి సిరి హన్మంత్‌కు కథానాయికగా ఛాన్స్ ఇచ్చారు. మిగతా సినిమాల్లాగా కాకుండా హీరోయిన్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. ఇంత మంచి పాత్రలు తెలుగువాళ్లకు రావు. ఆమెను ప్రమోషన్స్‌కు పిలిచినప్పుడు నేను రాలేను అని చెప్పింది. ట్రైలర్లో తన పాత్ర అసభ్యంగా ఉందని, అది చూసినవాళ్లకు తన మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని తనకు తానే ఊహించుకుంది. దానికి, ప్రమోషన్స్‌కు రాకపోవడానికి సంబంధం ఏంటో నాకర్థం కాలేదు. ఏదేమైనా హీరోయిన్గా సినిమా ప్రమోషన్స్‌కు రావడం తన బాధ్యత. తన పాత్ర గురించి ముందు ఒకలా చెప్పారు కానీ తర్వాత వేరేలా చూపించారని ఆమె ఫీలైంది. కానీ ఒకసారి సిరి సినిమా చూస్తే దర్శకుడు తనను ఎంత బాగా చూపించాడో అర్థం అయ్యేది. నాకు తెలిసి ఆమె ఇప్పటికీ సినిమా చూసి ఉండదు, చూస్తే మాత్రం తన అభిప్రాయం మారొచ్చు' అని నంద కిషోర్ చెప్పుకొచ్చాడు. అయితే, సిరి మాత్రం బదులుగా తన నుంచి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. -
సిద్ధార్థ్ బార్లో కూర్చొని పాలు తాగారా!
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఇటీవల తాగిన మైకంలో బీఎండబ్లూ కారు నడిపి ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఎమ్మెల్యే నందకిషోర్ మహారియా కుమారుడు సిద్ధార్థ్ మహారియా చుట్టూ పోలీసులు ఉచ్చు భిగించారు. ఓ ఆటోను బీఎండబ్యూ కారు ఢీకొన్నప్పుడు తన కుమారుడు కారును నడపడం లేదని, డ్రైవర్ నడిపాడని, తన కుమారుడికి మద్యం తాగే అలవాటే లేదని, పాలు తప్ప, మరోటి తాగడని, యాక్సిడెంట్ అయిన రాత్రి ఎదురుగా వచ్చిన ఆటోకు అసలు లైట్లు లేవంటూ తన కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్యే వేసిన ఎత్తులన్నీ పోలీసుల ముందు చిత్తయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన రోజున యాక్సిడెంట్‌కు ముందు సిద్ధార్థ్ మారియా ఓ బార్‌కు, రెండు హోటళ్లుకు వెళ్లాడని, వాటిల్లో మద్యం సేవించాడని ఆ బార్‌ను, హోటళ్ల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజుల్లో స్పష్టమైంది. ముఖ్యంగా ఓ బార్లో కూర్చొని స్పానిష్ వైన్ సేవించినట్లు ఫుటేజ్‌లో తేలింది. కొసేకా బ్రాండ్‌కు చెందిన వైన్ సేవించినట్లు కూడా సీసీటీవీల్లో రికార్డయింది. అంతేకాదు మద్యం సేవించిన అనంతరం కారును సిద్ధార్థే నడపడం, ప్రమాదం అనంతరం కారులోని డ్రైవర్ సీటు నుంచి సిద్ధార్థ దిగడం కూడా వీధుల్లోని సీసీటీవీ కెమేరాలు బయటపెట్టాయి. సీసీటీవీ ఫుటేజ్‌లతోపాటు బార్, హోటళ్లలో సిద్ధార్థ చెల్లించిన బిల్లులను కూడా జైపూర్ పోలీసులు సేకరించి సిద్ధార్థపై పగడ్బందిగా కేసును నమోదు చేశారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఆటో హెడ్లైట్లు లేకుండా దూసుకొచ్చింది అంటూ ఎమ్మెల్యే చేసిన వాదన కూడా వీగిపోయింది. పోలీసు దర్యాప్తులో ఆటో హెడ్లైట్లు పనిచేస్తున్నట్లు వెల్లడైంది.