Bigg Boss Non-Stop: BB OTT Telugu Contestants Revealed, Proof Here - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీకి సర్వం సిద్ధం.. మరింత గ్రాండ్‌గా హౌస్‌

Feb 19 2022 11:48 AM | Updated on Feb 19 2022 1:40 PM

Bigg Boss Ott Telugu Contestants Revealed Here Is The Proof - Sakshi

Bigg Boss Ott Telugu Contestants Revealed: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ ఓటీటీ ఈనెల 26నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. షో రెగ్యులర్‌ బిగ్‌బాస్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈసారి అంతకుమించి అనేంతలా షో ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత సీజన్స్‌లో పాపులర్‌ కంటెస్టెంట్లతో పాటు కొత్త కంటెస్టెంట్లతో 24గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు బిగ్‌బాస్‌ రెడీ అయ్యింది. ఇప్పటికే అందుకు తగ్గట్లు బిగ్‌బాస్‌ సెట్‌ సైతం మరింత అందంగా ముస్తాబైంది.

ఇక ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓవైపు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంటే, కొందరు కంటెస్టెంట్ల ఫేసులు కూడా రివీల్‌ అయిపోయాయి.బిగ్‌బాస్‌ స్టేజ్‌పై కంటెస్టెంట్ల ఇంట్రో పర్‌ఫామెన్సుల వీడియో క్లిప్పింగులు ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. 

అఖిల్‌ సార్థక్‌, అరియానా గ్లోరీ, అషు రెడ్డి, హమీదా, అనిల్‌ రాథోడ్‌(మోడల్‌), తేజస్విని, సరయు, యాంకర్‌ స్రవంతిల ఫోటోలు లీకయ్యాయి. గత సీజన్స్‌ కంటే మరింత గ్రాండ్‌గా హౌస్‌ ముస్తాబయ్యింది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో  ఈ నెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది. 

ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ అంటూ ప్రోమోను వదిలిన మేకర్స్‌ అందుకు తగ్గట్లుగానే షోను ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఈసారి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న బిగ్‌బాస్‌ షో ఎలా ఉంటుందన్నది ముందుముందు చూడాల్సి ఉంది.

చదవండి: Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్ల ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement