Bigg Boss OTT Telugu Non Stop Promo: Serious Fight Between Bindu Madhavi And Nataraj Master - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop Telugu: బిందు మాధవి-నటరాజ్‌ మధ్య మాటల యుద్ధం..

May 10 2022 3:17 PM | Updated on May 11 2022 6:51 PM

Bigg Boss Non Stop Telugu Bindu Madhavi Vs Nataraj Master Fight - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ తరుణంలో ఫైనల్‌కు చేరుకునేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానా, బిందు మాధవి, నటరాజ్‌ మాస్టర్‌, మిత్ర, యాంకర్‌ శివ, అఖిల్, అనిల్‌, బాబా మాస్టర్‌ ఉన్నారు.

Bigg Boss Non Stop Telugu Bindu Madhavi Vs Nataraj Master Fight: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ తరుణంలో ఫైనల్‌కు చేరుకునేది ఎవరా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానా, బిందు మాధవి, నటరాజ్‌ మాస్టర్‌, మిత్ర, యాంకర్‌ శివ, అఖిల్, అనిల్‌, బాబా మాస్టర్‌ ఉన్నారు. అయితే పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. తర్వాత 72వ రోజు ఈ టాస్క్‌ను కొనసాగించమని సూచించాడు. ఈ క్రమంలో అరియానా, బిందు మాధవి, బాబా మాస్టర్‌ అర్హులు కానివారిగా నటరాజ్‌ ఎంపిక చేశాడు. దీనికి సంబంధించిన ప్రొమోను మంగళవారం (మే 10) విడుదల చేశారు. 

ఈ ఎంపికలో బిందు మాధవిపై విరుచుకుపడ్డాడు నటరాజ్ మాస్టర్‌. 'నెగెటివిటీ మాత్రమే కంప్లీట్‌గా ఉన్న ఏకైక పర్సన్‌ నువ్‌ మాత్రమే' అని నటరాజ్‌ అనగా, 'నీ సైడ్‌ ఏమొచ్చింది ఇన్ని రోజులు పాజిటివిటీనా' అని తిరిగి క్వశ్చన్‌ చేస్తుంది బిందు మాధవి. 'నీ బెస్ట్‌ గేమ్‌ ఏంటి' అని నటరాజ్ అడిగిన ప్రశ్నకు 'ఐయామ్‌ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్‌ పర్సన్‌ ఇన్‌ దిస్‌ హౌజ్‌' అని బిందు గట్టిగానే చెబుతుంది.





తర్వాత ఇద్దరిమధ్య మాటలు పెరిగి నీ బండారం బయట పెడుతున్న కెమెరా వైపు చూసి అని నటరాజ్ చెబుతాడు. దీనికి బిందు మాధవి పరాశక్తిలా అవతారంలా ఫోజు ఇస్తుంది. దీనికి 'శూర్పణఖ నీ టైమ్‌ ఆసన్నమైంది ఇదిగో లక్ష‍్మణ బాణం. ఆడియెన్స్‌ నీ ముక్కు కోస్తారు.. పక్కా' అంటూ బాణం విసిరినట్టుగా ఫోజు ఇస్తాడు నటరాజ్ మాస్టర్‌. అలాగే అఖిల్‌-శివ, అఖిల్-బిందు మాధవి, నటరాజ్‌-బాబా మాస్టర్‌ మధ్య మాటల రచ్చను కూడా ఈ ప్రొమోను చూపించారు. 



చదవండి: పిచ్చి ముదిరింది, శూర్పణఖ అంటూ రెచ్చిపోయిన నటరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement