Vj Sunny : దొంగతనం మొదలుపెట్టిన వీజే సన్నీ.. ఫోటోలు వైరల్‌

Bigg Boss Fame Vj Sunny Announces His New Project With Dil Raju - Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, హరీష్‌ శంకర్‌ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’. బిగ్‌బాస్‌ ఫేం వీజే సన్నీ, దివితో పాటు నటుడు సుబ్బరాజు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్‌కు హరీష్‌ శంకర్‌ కథ అందించారు.  హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈనెల 27నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది.

ఈ సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక తన కొత్త వెబ్‌సిరీస్‌పై సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. 'ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఏటీఎం వెబ్‌సిరీస్‌ గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. దొంగతనం షురూ' అంటూ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా వీజే సన్నీకి అలీ, సోహైల్‌ సహా పలువురు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top