Bigg Boss Siri Hanmanth Buys New Car Details Inside | Shrihan - Sakshi
Sakshi News home page

Siri Hanmanth New Car: కొత్త కారు కొన్న సిరి.. డ్రైవింగ్‌ నేర్చుకో అని సెటైర్లు

Jul 13 2022 1:03 PM | Updated on Jul 13 2022 2:48 PM

Bigg Boss Fame Siri Hanmanth Buys A New Car - Sakshi

సిరి హన్మంత్‌.. బిగ్‌బాస్‌ రియాల్టీ షో ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. బిగ్‌బాస్‌-5లో ఆమె చేసిన రచ్చ అంత ఇంత కాదు. హౌస్‌లో షణ్ముఖ్‌తో క్లోజ్‌గా ఉండటం..బయటకు వచ్చాక ఆమె కారణంగానే షణ్ముఖ్‌, దీప్తి సునైనా విడిపోయారనే వార్తలు వినిపించడంతో సిరి పేరు నెట్టింట మరింత వైరల్‌ అయింది.

ఒకానొక దశలో సిరి, ఆమె ప్రియుడు శ్రీహాన్‌ కూడా విడిపోయారనే టాక్‌ వచ్చింది. కానీ మళ్లీ కలిశారు. ఇప్పుడు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. తాజాగా వీరిద్దరు కలిసి కొత్త కారు కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సిరి ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. 

అందులో శ్రీహాన్‌ కూడా ఉన్నాడు. అంతేకాదు సిరి కొత్త కారు కొనడంపై శ్రీహాన్‌ కౌంటర్‌ కూడా వేశాడు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూనే ‘ముందు డ్రైవింగ్‌ నేర్చుకో సిరి..’అంటూ తనదైన స్టైల్లో కౌంటర్‌ వేశాడు.

మొత్తానికి విడిపోతారనుకున్న సిరి, శ్రీహాన్‌ ఇలా జంటగా కారు కొనడం పట్ల ఇరువురి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోకి శ్రీహాన్‌ రాబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే శ్రీహాస్‌ వస్తే మాత్రం ఆట అదిరిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement