ఓ ఇంటివాడు కాబోతున్న మానస్‌.. హల్దీ వేడుకలు షురూ | Sakshi
Sakshi News home page

Maanas: పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుకల్లో పంచె కట్టిన మానస్‌

Published Sun, Sep 10 2023 4:26 PM

Bigg Boss Contestant Manas Haldi Function - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటుడు మానస్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ్రీజతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ మధ్యే వీరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఆర్జే కాజల్‌, వీజే సన్నీ ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలో మానస్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా మానస్‌ ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి. నేడు హల్దీ వేడుక జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. పసుపు దంచే కార్యక్రమం ఉందంటూ మానస్‌ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు. పంచెకట్టులో మానస్‌ మెరిసిపోగా కొడుకును చూసి మురిసిపోయింది అతడి తల్లి పద్మిని. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మానస్‌కు శుభాకాంక్షలు చెప్తుంటే మరికొందరు మాత్రం అప్పుడే పెళ్లికి రెడీ అయిపోయావేంటి? అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement