హీరోగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్.. పాటతో కుమ్మేసిన భోలె! | Sakshi
Sakshi News home page

Aata Sandeep: ఆట సందీప్‌ కొత్త మూవీ.. ఈవెంట్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ సందడి!

Published Tue, Jan 9 2024 6:32 PM

Bigg Boss Contestant Aata Sandeep latest Movie Teaser Launch - Sakshi

ఆట సందీప్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.  టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్‌ సీజన్‌లో విజేతగా నిలిచి ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన పేరు ఆట సందీప్‌గా మారిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్‌ కూడా మంచి డ్యాన్సరే కావడం విశేషం. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. చాలా వారాల పాటు హౌస్‌లోనూ తన ఆటతీరుతో మెప్పించారు. 

అయితే ప్రస్తుతం ఆట సందీప్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ది షార్ట్‌కట్ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. విజయానికి అడ్డదారులువండవు అనేది ఈ మూవీకి క్యాప్షన్. ఈ చిత్రాన్ని రామకృష్ణ కంచి దర్శకత్వంలో తోట రంగారావు, రజినీకాంత్ పున్నపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఈవెంట్‌కు హాజరైన వారిలో భోలె షావలి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అశ్విని, గౌతమ్‌ ఉన్నారు. 

 
Advertisement
 
Advertisement