ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్! | Bigg Boss Telugu 7 Elimination: Nayani Pavani Elimination This Week - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Elimination: ఇది నిజంగా షాకింగే.. ఆరోవారం ఆమె ఎలిమినేట్!

Oct 14 2023 6:26 PM | Updated on Oct 14 2023 6:37 PM

Bigg Boss 7 Telugu Nayani Pavani Elimination - Sakshi

ఈసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ అనుకున్నంత గొప్పగా ఏం సాగట్లేదు! వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని గత ఆదివారం ఏకంగా ఐదుగురు కొత్తోళ్లని తీసుకొచ్చారు. కానీ ఆటలో పెద్దగా మార్పు అయితే వచ్చినట్లు కనిపించలేదు. ఇప్పుడు వాళ్లలో ఓ బ్యూటీని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?

ఎలిమినేషన్ ఎవరు?
బిగ్‌బాస్‌ 7 ఆరోవారం ఎలిమినేషన్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. అమరదీప్, ప్రిన్స్ యవర్, తేజ, శోభాశెట్టి, పూజా, అశ్విని, నయని పావని ఈ లిస్టులో ఉన్నారు. అయితే వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే రెండు రోజుల  ముందు వరకు శోభాశెట్టి, పూజా చివరి స్థానాల్లో ఉన్నారు. వీళ్లకు పైన నయని పావని ఉంది. అలాంటిది ఇప్పుడు నయని ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!)

ఎలిమినేషన్ ట్విస్ట్?
గతవారం హౌస్ నుంచి ప్రియాంక వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ శుభశ్రీని పంపేశారు. గౌతమ్ ని ఎలిమినేట్ చేసినట్లు షో చేసి సీక్రెట్ రూంలో పెట్టారు. తిరిగి హౌసులోకి తీసుకొచ్చేశారు. ఈ వారం కూడా శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెని సేఫ్ చేసి నయని పావనిని బయటకు పంపేశారా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా వచ్చిన అమ్మాయిల్లో అశ్విని, పూజామూర్తి, నయని పావని ఉన్నారు. వీళ్లు వచ్చి వారం కూడా కాలేదు కాబట్టి పెద్దగా నిరూపించుకునే ఛాన్స్ రాలేదు. ఇప్పుడేమో నయని పావని ఎలిమినేషన్ అంటున్నారు. మరో 1-2 వారాలు ఉంచున్నాసరే ఈమె గేమ్ ఏంటనేది తెలిసేది. అసలు నయనని నిజంగానే ఎలిమినేట్ చేశారా అనేది ఆదివారంతో క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్‌ ఫోన్స్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement