
బిగ్‌బాస్‌లో సోమవారం నామినేషన్స్ రచ్చ ఓ రేంజ్‌లో జరిగింది. శ్రీహాన్ తప్పా మిగతా ఇంటిసభ్యులంతా ఒకరిపై ఒకరు గట్టిగానే కౌంటర్ అటాక్ చేశారు. ఏమాత్రం మొహమాటం లేకుండా తాము నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్లకు రెడ్‌కలర్ పెయింట్ వేసేశారు. మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారన్నది బిగ్‌బాస్ సీజన్-6లో 16వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం.
వరస్ట్ పర్‌ఫార్మర్‌గా ఎంపికైన సత్య జైలుకి వెళ్లింది. దీంతో అర్జున్ వెళ్లి కాసేపు ఆమెతో పులిహోర కలపడానికి ట్రై చేశాడు. ఇక గీతూ వచ్చి ఆమెను అగ్రెసివ్‌గా ఉండటం తగ్గించుకోమని సలహాలు ఇవ్వడం ఫన్నీగా అనిపిస్తుంది. ఆ తర్వాత అసలు సిసలైన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈవారం నామినేషన్స్ హీట్ ఓ రేంజ్‌లో సాగింది. మొదటగా శ్రీసత్యతో నామినేషన్స్ ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు తాము నామినేట్ చేయాలనుకున్నవాళ్లకి రెడ్ కలర్ పెయింట్‌ను ముఖానికి రాసి సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది.
ముందుగా సత్య ఆరోహిని నామినేట్ చేసింది. ఇంటి కెప్టెన్ అయిన రాజ్ చెప్పినా తన మాటకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం తనకు నచ్చలేదని, అంతేకాకుండా తనను వరస్ట్ అని చెప్పడం కూడా ఒక కారణం అంటూ ఇనయాను కూడా ఆమె నామినేట్ చేసింది. దీనికి కౌంటర్‌గా ఇనయా అసలు నువ్వు గేమ్ ఆడటం లేదని, కేవలం కబుర్లు చెప్పడం తప్పా పెద్దగా పని చేసిందని లేదని గట్టిగా బదులిచ్చింది.ఇక గీతూ వచ్చి చంటి, సుదీపను నామినేట్ చేస్తుంది. ఎమోషనల్ ఎపిసోడ్‌లో సుదీప బాగా కన్నీళ్లు పెట్టుకొని ఆ తర్వాత టిష్యూలను అక్కడే పడేసిందని, కనీసం ఆ తర్వాతి రోజు కూడా బయటపడేయలేదని చెప్పి గీతూ చెప్పగా సుదీప షాక్ అయ్యింది.
ఇలాంటి సిల్లీ రీజన్‌కు నామినేట్ చేయడంతో నీ బుద్ది ఎక్కడ ఉందో అర్థమవుతుందంటూ ఫైర్ అయ్యింది. ఇక చంటీని రియల్‌గా ఉండటం లేదంటూ ఆ కారణంగా నామినేట్ చేస్తున్నట్లు పేర్కొంది.ఇక తర్వాత నేహా.. గేమ్ ఆడటం లేదన్న కారణంగా వసంతిని నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. తనను వరస్ట్ సంచాలక్ అనడం నచ్చలేదని, ఈ కారణంగా గీతూని నామినేట్ చేస్తున్నానని పేర్కొంది. దీంతో గీతూ మళ్లీ ఆమెను నువ్వు వరస్ట్ సంచాలక్‌వే అంటూ మరోసారి తన అభిప్రాయాన్ని కుండద్దలు కొట్టినట్లు చెప్పింది.
ఇక ఇనయా గీతూ, రేవంత్‌లను నామినేట్ చేసింది. ఈ ప్రక్రియలో గీతూ, ఇనయాలకు మధ్య పెద్ద గొడవే జరిగింది. స్ట్రాటజీ అంటూ ఆమె ఆడే గేమ్ తీరు తనకు నచ్చలేదని ఇనయా పేర్కొంది. అంతేకాకుండా ఏదో బట్టల ర్యాక్ గురించి కూడా ఇద్దరికీ మధ్య డైలాగ్ వార్ నడిచింది. దీంతో దొబ్బెయ్ అంటూ గీతూ ఆమెపై నోరుపారేసుకుంది. సుదీప రేవంత్, గీతూలను నామినేట్ చేసింది. తన బేబీని కోల్పోయానన్న ఎమోషనల్ స్టోరీని చెబుతున్నప్పుడు నిజంగానే టిష్యూల గురించి మర్చిపోయానని, అయినా ఇలాంటి విషయానికి నామినేట్ చేస్తావా అంటూ సుదీప బాగా ఎమోషనల్ అయ్యింది.
ఆదిరెడ్డి ఆనయా, వసంతిలను నామినేట్ చేశాడు. రోహిత్ అండ్ మెరీనా జంట రేవంత్, ఫైమాలను నామినేట్ చేయగా, తనను నామినేట్ చేయడం నచ్చలేదంటూ ఫైమా... రోహిత్‌కు రెడ్ కలర్ పెయింట్ రాసింది. బాలాదిత్యను కూడా ఫైమా నామినేట్ చేసింది. సో మొత్తానికి మూడోవారం జరిగిన నామినేషన్స్‌లో వసంతి, బాలాదిత్య, చలాకీ చంటీ, ఆరోహి రావ్, నేహా, ఇనయా సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్‌లు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.