Bigg Boss 6 Telugu: హార్ట్‌బీట్‌ లేదన్నారు,రెండుసార్లు బిడ్డను కోల్పోయాం: మెరీనా అండ్‌ రోహిత్‌

Bigg Boss 6 Telugu: Housemates Break Down Into Tears Shares Thier Emotional Stories - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 గురువారం నాటి ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా సాగింది. హౌస్‌మేట్స్‌ తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది వారి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ ప్రక్రియలో ఓపెన్‌అప్‌ అయ్యారు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు తమ జీవితంలో జరిగిన సాడ్‌ స్టోరీని వివరించి కంటతడి పెట్టించారు. మరోవైపు బిగ్‌బాస్‌ రెండో ఇంటి కెప్టెన్‌గా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6 పన్నెండో ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేద్దాం.

ముందుగా ఆదిరెడ్డి మాట్లాడాడు. తన తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పాడు. కానీ కష్టాలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఈరోజు తన తల్లి బతికిఉంటే తన సక్సెస్‌ని చూసి సంతోషించేందని చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు. తన కూతురులోనే అమ్మను చూసుకుంటున్నానని తెలిపాడు. 

ఇక సుదీప తన ప్రెగ్నెన్సీ స్టోరీని వివరిస్తూ అందరిని కంటతడి పెట్టించింది. థైరాయిడ్‌ కారణంగా బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని చెబుతూ సుదీప కన్నీళ్లు పెట్టుకుంది.  తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకున్నానని, కానీ తనను తిరిగి ఇచ్చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయిందని చెప్పింది. ఎప్పటికైనా తనకంటూ ఓ బిడ్డ పుడుతుందనే ఆశతో బతుకుతున్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నొచుకోలేదని చెప్పిన రేవంత్‌ త్వరలోనే తాను తండ్రి కాబోతున్నానని చెబుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఎప్పుడెప్పుడు తన బిడ్డతో నాన్న అని పిలిపించుకుందామా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చలకీ చంటీ జీవితంలోనూ అంతులేని విషాదం ఉంది. కళ్లెదుటే ఫైర్‌ యాక్సిడెంట్‌లో తన తల్లి చనిపోయిందని చెప్పిన చంటీ ఆ తర్వాత కవల పిల్లల రూపంలో తనకు ఆ దేవుడు అమ్మను ప్రసాదించాడని తెలిపాడు. బిగ్‌బాస్‌ క్యూట్‌ కపుల్‌ మెరీనా అండ్‌ రోహిత్‌లు తమ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని వివరిస్తూ.. మూడోనెల దాటాక బేబీ హార్ట్‌బీట్‌ లేదని చెప్పారు. వేరే ఆప్షన్‌ లేదు..బేబీని తీసేయాల్సి వచ్చింది అని చెబుతూ ఏడ్చేశారు.

దేవుడిని దర్శించుకొని తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో తన కుటుంబం మొత్తం చనిపోయారని చెబుతూ కీర్తి భట్‌ ఎమోషనల్‌ అయ్యింది.  కొన్ని సిచ్యువేషన్స్‌ వల్ల ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పిన శ్రీసత్య అది ఫ్యామిలీకి చాలా ఎఫెక్ట్‌ పడిందని చెప్పింది. తన ఫ్యామిలీ దూరమవడంతో ఓ అనాథ పాపను దత్తత తీసుకున్నానని చెప్పిన కీర్తి బిగ్‌బాస్‌కి వచ్చేముందే తన కూతుర్ని పోగోట్టుకున్నానని చెప్పింది.

చివరి నిమిషంలో కూడా తన కూతురితో ఉండలేకపోయినందుకు బాధగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.ఇదిలా ఉండగా బిగ్‌బాస్‌ సీజన్‌-6 రెండో ఇంటి కెప్టెన్‌ కోసం కెప్టెన్సీ పోటీదారులంతా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో తమకు ఓటేయాలంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు అడిగారు. అయితే ఈ ప్రక్రియలో రాజ్‌కి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే నిర్ణయానికి వచ్చారు. ఇవాల్టి ఎపిసోడ్‌లో రెండో ఇంటి కెప్టెన్‌ ఎవరో తెలియనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top