Bigg Boss 5 Vishwa Home Tour Video Goes Viral - Sakshi
Sakshi News home page

Vishwa Home Tour : బిగ్‌బాస్‌ ఫేం విశ్వ ఇల్లు ఎంత బావుందో చూడండి..

Jan 24 2022 1:24 PM | Updated on Jan 24 2022 2:23 PM

Bigg Boss 5 Vishwa Home Tour Video Goes Viral - Sakshi

Bigg Boss 5 Vishwa Home Tour Video Goes Viral: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న వారిలో నటుడు విశ్వ ఒకరు. బిగ్‌బాస్‌ కంటే ముందు కొన్ని సీరియల్స్‌, సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో ఎంతోమందికి చేరువయ్యాడు. టాస్కుల్లో మిగతా కంటెస్టెంట్ల కంటే స్ట్రాంగ్‌ అనేలా పేరు తెచ్చుకున్న విశ్వ బిగ్‌బాస్‌ అనుకోని విధంగా ఎలిమినేట్‌ అయి షాకిచ్చాడు.

కానీ బిగ్‌బాస్‌ అనంతరం సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టి మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వివిధ రకాల వీడియోలతో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నాడు. తాజాగా తన సొంతింటిని నెటిజన్లకు పరిచయం చేశాడు. అంతేకాకుండా తన ఇంటికి ఎలా రావాలో స్వయంగా కారు నడుపుకుంటూ అడ్రస్‌ చూపించాడు.

ఇక ఇది తన సొంతిల్లు అని, 2017లో దీన్ని నిర్మించుకున్నట్లు తెలిపాడు. ఇంట్లో వాళ్లందరిని పరిచయం చేస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలను వివరించాడు. మరి విశ్వ హోంటూర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.  
 

Advertisement
 
Advertisement
Advertisement