అది నిరూపిస్తే బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతా: స‌న్నీ స‌వాల్‌ | Bigg Boss 5 Telugu: VJ Sunny Selected As Worst Performer 2nd Time | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: త్రిమూర్తుల‌తో పెట్టుకున్న స‌న్నీ, చివ‌ర‌కు క‌ట‌క‌టాల్లోకి!

Oct 29 2021 11:47 PM | Updated on Oct 29 2021 11:54 PM

Bigg Boss 5 Telugu: VJ Sunny Selected As Worst Performer 2nd Time - Sakshi

నీ గేమ్ నువ్వు ఆడు, ప‌క్క‌వాళ్ల గేమ్ ఆడ‌కు అని హెచ్చ‌రిస్తూ కాజ‌ల్ చెత్త‌గా ఆడింద‌న్నాడు శ్రీరామ్‌. జెస్సీని కావాల‌ని త‌న్నాను అని నిరూపిస్తే ఇప్ప‌టికిప్పుడు హౌస్‌లో నుంచి వెళ్లిపోతాన‌న్నాడు. 

Bigg Boss Telugu 5, Episode 55: కెప్టెన్సీ టాస్క్‌లో జ‌రిగిన గొడ‌వ నుంచి తేరుకోలేక‌పోయాడు స‌న్నీ. తాను, మాన‌స్‌ ఎలా ఓడిపోయాన‌ని చెప్తార‌ని ఆవేశంతో ఊగిపోయాడు. ఇదంతా హౌస్‌లో నుంచి చూసిన ర‌వి.. స‌న్నీతో మాట్లాడు కానీ మాన‌స్‌తో మాట్లాడొద్దు అని జెస్సీకి స‌ల‌హా ఇచ్చాడు. గేమ్‌లో ఉన్న‌ప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మండుతుంద‌ని ఫైర్ అయ్యాడు శ్రీరామ్‌. మ‌రోప‌క్క ర‌వి ఈవారం పెద్ద‌గా ప‌ర్ఫామ్ చేయ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు ష‌ణ్ను. అటు కాజ‌ల్ మాత్రం శ్రీరామ్ ఇంకా మాస్క్ తీయ‌లేద‌ని స‌న్నీ, మాన‌స్‌ల‌తో చెప్పుకొచ్చింది. అటు శ్రీరామ్‌.. నామినేష‌న్స్ త‌ప్పించుకునేందుకు కాజ‌ల్‌ కాంట్ర‌వ‌ర్శీల‌కు పోవ‌డం లేద‌ని పేర్కొన‌గా ర‌వి అవున‌ని త‌లూడించాడు. ఆమెను సేఫ్ ప్లేయ‌ర్‌గా అభివ‌ర్ణించాడు.

త‌ర్వాత హౌస్‌లో వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌ను ఎన్నుకోమ‌ని ఆదేశించాడు బిగ్‌బాస్‌. ముందుగా కెప్టెన్ ష‌ణ్ను.. నీ ఫ్రెండ్స్ వ‌ల్ల నీ గేమ్ క‌నిపించ‌లేదంటూ కాజ‌ల్ పేరు సూచించాడు. స‌న్నీ.. సంచాల‌కుడిగా ఫెయిల్ అయ్యాడంటూ జెస్సీ పేరు చెప్పాడు. ఇక మాన‌స్ కూడా సంచాల‌కుడిగా స‌రిగా ప‌ని చేయ‌లేద‌ని జెస్సీనే వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా పేర్కొన్నాడు. ర‌వి, సిరి.. స‌న్నీని; యానీ.. ప్రియాంకను; ప్రియాంక సింగ్‌, లోబో.. యానీ మాస్ట‌ర్‌ను వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా.పేర్కొన్నారు టాస్క్‌లో శ్రీరామ్ ప్ర‌వ‌ర్త‌న‌ ప్రొవోకింగ్‌గా అనిపించింద‌ని చెప్పింది కాజ‌ల్‌. త‌ర్వాత జెస్సీ.. స‌న్నీని వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్ అని చెప్పే క్ర‌మంలో వీళ్లిద్ద‌రికీ మ‌రోసారి గొడ‌వైంది.

నీ గేమ్ నువ్వు ఆడు, ప‌క్క‌వాళ్ల గేమ్ ఆడ‌కు అని హెచ్చ‌రిస్తూ కాజ‌ల్ చెత్త‌గా ఆడింద‌న్నాడు శ్రీరామ్‌. మొత్తంగా ఈ టాస్క్ ముగిసే స‌మ‌యానికి కాజ‌ల్‌, స‌న్నీకి మూడేసి ఓట్లు ప‌డ్డాయి. దీంతో కెప్టెన్ ష‌ణ్ను.. స‌న్నీ బ‌స్తాను త‌న్న‌డం న‌చ్చ‌లేదంటూ అత‌డిని వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో త్రిమూర్తుల‌కు, స‌న్నీకి మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగింది. సిరి క‌త్తి ప‌ట్టుకోవ‌డం త‌ప్పు కాదా? అని ప్ర‌శ్నించాడు జెస్సీని కావాల‌ని త‌న్నాను అని నిరూపిస్తే ఇప్ప‌టికిప్పుడు హౌస్‌లో నుంచి వెళ్లిపోతాన‌న్నాడు. అత‌డికి మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగి వాద‌న‌కు దిగారు మాన‌స్‌, కాజ‌ల్‌. చివ‌ర్లో యానీ.. త‌న ఓటును స‌న్నీకి మార్చ‌డంతో ఇంట్లో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా స‌న్నీకే 4 ఓట్లు ప‌డ్డాయి. దీంతో అత‌డిని జైల్లో వేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement