
నాకు దీపు చాలా గుర్తొస్తుంది, ఒంటరిగా అనిపిస్తోంది. తనుంటే బాగుండేది అంటూ ప్రేయసిని గుర్తు చేసుకున్నాడు షణ్ను. అస్సలు ఉండాలని లేదని, నీ ఫ్రెండ్‌షిప్, నువ్వు ఏదీ వద్దని అన్నాడు.
Bigg Boss 5 Telugu, Episode 73: నామినేషన్స్ నుంచి అంత ఈజీగా బయటకు రాలేకపోయారు హౌస్‌మేట్స్. కాజల్ అయితే.. సిరికి నేనంటే ఇష్టం లేదు, అఫెక్షన్ లేదంటూ బోరుమని ఏడ్చేసింది. ఇది చూసిన యానీ అదంతా డ్రామా, స్ట్రాటజీ అని పెదవి విరిచింది. పైగా తన కోసమే ఏడుస్తుందేమోనని ఫీలైన యానీ.. ఆమె దొంగ ఏడుపులు నమ్మనని, తాను మాత్రం ఆమె దగ్గరకు వెళ్లేదే లేదని భీష్మించుకు కూర్చుంది.
తర్వాత ప్రియాంక వంతు రాగా.. తను మానస్ గేమ్ ఆడుతున్నానని సిరి ఎలా అంటుందని చిర్రుబుర్రులాడింది. ఈ క్రమంలో మనసులోని మాటను బయటపెట్టింది. ట్రాన్స్‌జెండర్‌గా నేను అతడిని ప్రేమిస్తున్నాను, కానీ అదిక్కడ సెట్ కాదు. నా గేమ్ నేను ఆడట్లేదని సిరి ఎలా అంటుంది? అని ఆవేశపడింది. ఇక ఈ వారం బయటకు వెళ్లిపోతానని ఫిక్సైన కాజల్.. తన ఫ్రెండ్స్‌తో జ్ఞాపకాలను కూడబెట్టుకోవాలనుకుంది. మరోపక్క బాగా దిష్టి తగలడం వల్లే దిష్టితాడు తెగిపోయిందని అభిప్రాయపడింది సిరి. ఈసారి అది తెగిపోకుండా గట్టిగా ముడివేసి దానికి తన రక్తపు బొట్టును పెట్టి మరీ షణ్ముఖ్ చేతికి కట్టింది. అయితే కావాలని గుచ్చుకున్నావా? లేదంటే అనుకోకుండా తగిలిందా? అని షణ్ను అడగ్గా అనుకోకుండానే కట్ అయి రక్తం వచ్చిందనని చెప్పింది సిరి.
ఎప్పటిలాగే సిరి- షణ్ను మరోసారి గొడవపడ్డారు. నీ ముఖం చూస్తేనే చిరాకుగా ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపో అనడంతో షణ్ను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ గొడవతో ఏడ్చేసిన సిరి.. సన్నీ నామినేషన్స్‌ను ఇమిటేట్ చేస్తుంటే నవ్వేసింది. దీంతో షణ్ను.. దీన్నే డబుల్ ఫేస్ అంటారని, నా దగ్గర ఇలా ఉండకు, నన్ను మర్చిపో అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వున్నా నాకు ఫరాఖ్ పడలేదన్నాడు. మాటలు అయితే అన్నాడు కానీ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేశాడు. దీంతో సిరి అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించింది. నువ్వే మాటలు అంటావు, మళ్లీ నువ్వే బాధపడాతవేంటని అడిగింది. దీంతో షణ్ను.. నేను ఏడ్వడం వల్ల నువ్వేం తక్కువైపోవు, నా క్యారెక్టరే తప్పు, వెళ్లిపో అని గట్టిగా గద్దించాడు.
నాకు దీపు చాలా గుర్తొస్తుంది, ఒంటరిగా అనిపిస్తోంది. తనుంటే బాగుండేది అంటూ ప్రేయసి దీప్తి సునయనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నాడు షణ్ను. అస్సలు ఉండాలని లేదని, నీ ఫ్రెండ్‌షిప్, నువ్వు ఏదీ వద్దని అన్నాడు. నాకు నువ్వు అక్కర్లేదు, వెళ్లిపో అనడంతో సిరి ఏడ్చుకుంటూ బాత్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని తల గోడకేసి కొట్టుకుంది. దీంతో హడలిపోయిన షణ్ను.. తల బాదుకోకు, డోర్ తీయంటూ వేడుకున్నాడు. కంగారుపడిపోయిన కంటెస్టెంట్లు బాత్రూందగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. రవి డోర్ బాదడంతో ఏడుస్తూనే గడియ తీసింది. వెంటనే షణ్ను ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.
బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'మీ ఇల్లు బంగారం కాను' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బజర్ మోగినప్పుడు ముందుగా మైనర్ హ్యాట్‌లను పట్టుకున్నవారికి గోల్డ్ మైన్‌లో నుంచి వీలైనంత ఎక్కువ బంగారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు బంగారం వెతుకులాటలో పడిపోయారు. మధ్యలో మెరుపుల శబ్ధం వచ్చినప్పుడు మానస్ పవర్ రూమ్ యాక్సెస్ పొందగా అతడి ఎదుటు ఉన్న గొడ్డలిని సన్నీకిచ్చాడు. దీని పవర్ ఏంటనేది బిగ్‌బాస్ సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాడని తెలిపాడు. ఇక సిరి ఒకరితో రిలేషన్, నేనొకరితో రిలేషన్‌లో ఉన్నాం.. కానీ హౌస్‌లో మేమిద్దరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం.. అదే నాకు సమస్యగా మారింది. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నానని మనసులోని బాధను శ్రీరామ్‌తో పంచుకున్నాడు షణ్ముఖ్.