Bigg Boss 5 Telugu: Kaushal Manda Prediction On BB5 Telugu Title Winner - Sakshi
Sakshi News home page

Kaushal Manda: బిగ్‌బాస్ 5 థ్రిల్ లేదు, ఈసారైనా గ‌ర్ల్స్ గెలుస్తార‌నుకున్నా..

Nov 4 2021 7:11 PM | Updated on Nov 6 2021 11:32 PM

Bigg Boss 5 Telugu: Kaushal Manda About BB5 Telugu Winner - Sakshi

'బిగ్‌బాస్ 5 పెద్ద‌గా థ్రిల్ అనిపించ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగేవారే టాప్ 5కు చేరుతారు. ఈసారైనా గ‌ర్ల్స్ గెలుస్తార‌నుకున్నాం.. కానీ అమ్మాయిల‌కంత స్కోప్ లేదు. త‌ప్ప‌కుండా అబ్బాయిలే ట్రోఫీ గెలుస్తారు' అని జోస్యం చెప్పాడు.

Bigg Boss Telugu 5: కౌశ‌ల్ మండా.. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజ‌న్ విన్న‌ర్ ఈయ‌న‌. బిగ్‌బాస్ షో త‌ర్వాత అత‌డి రేంజే మారిపోతుందనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా వాతావ‌ర‌ణం సైలెంట్ అయిపోయింది. చ‌డీచ‌ప్పుడు లేకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ పోతున్నాడు. ప్ర‌స్తుతం కౌశ‌ల్ అత‌డు ఆమె ప్రియుడు సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో సునీల్ క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. త్వ‌ర‌లో ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా అత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

'బిగ్‌బాస్ 5 పెద్ద‌గా థ్రిల్ అనిపించ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగేవారే టాప్ 5కు చేరుతారు. ఈసారైనా గ‌ర్ల్స్ గెలుస్తార‌నుకున్నాం.. కానీ అమ్మాయిల‌కంత స్కోప్ లేదు. త‌ప్ప‌కుండా అబ్బాయిలే ట్రోఫీ గెలుస్తారు' అని జోస్యం చెప్పాడు. బిగ్‌బాస్ షో తీరు చూస్తుంటే కౌశ‌ల్ చెప్పిందే నిజ‌మ‌య్యేట్లు క‌నిపిస్తోంది. 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం 11 మందే మిగిలారు. 8 మంది ఎలిమినేట్ అయ్యారు. అందులో న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, లోబో మిన‌హా.. స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, శ్వేత‌, హ‌మీదా, ప్రియ‌.. ఇలా ఆరుగురు లేడీ కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

ప్ర‌స్తుతం హౌస్‌లో సిరి, కాజ‌ల్‌, ప్రియాంక సింగ్‌, యానీ ఉన్నారు. వీరిలో పింకీ మాన‌స్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేస్తుంటే కాజ‌ల్ స్ట్రాట‌జీ జ‌పం చేస్తోంది. యానీ మాస్ట‌ర్ ఎప్పుడెలా ఉంటుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇక సిరి ఆడుతుంది కానీ ష‌ణ్ముఖ్‌, జెస్సీల‌తో మాత్ర‌మే ఎక్కువ‌గా ఉంటూ నెగెటివ్ పేరు సంపాదిస్తోంది. రానున్న వారాల్లో వీరిలో ఇద్ద‌రు, ముగ్గురు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులున్నాయి. మిగిలిన ఒక‌రిద్ద‌రు ఫినాలేకి వెళ్లినా గెలిచే అవ‌కాశాలు ఏ కోశానా క‌నిపించ‌డం లేదు. కాబ‌ట్టి ఈసారి కూడా అమ్మాయిని బిగ్‌బాస్ విజేత‌గా చూడాల‌న్న ఎంతో మంది క‌ల క‌ల‌గానే మిగిలిపోనున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement