బిగ్‌బాస్‌: పోలీసుల‌కు మోనాల్‌ ఫిర్యాదు | Bigg Boss 4 Telugu: Monal Complaint To Cyber Police On Abhijeet Fans | Sakshi
Sakshi News home page

అభి ఫ్యాన్స్‌ఫై పోలీసుల‌కు మోనాల్ ఫిర్యాదు

Dec 16 2020 4:01 PM | Updated on Dec 16 2020 6:24 PM

Bigg Boss 4 Telugu: Monal Complaint To Cyber Police On Abhijeet Fans - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో క‌న్నీళ్ల వ‌ర‌ద పారించిన కంటెస్టెంటు మోనాల్ గ‌జ్జ‌ర్‌. సంతోష‌మొచ్చినా, బాధొచ్చినా ఆమె క‌ళ్ల వెంట‌ నీటిప్ర‌వాహం ధార‌లు క‌ట్టేవి. అలా ఆమెకు నర్మ‌ద అన్న పేరు స్థిప‌ర‌డిపోయింది. హీరోయిన్ అయినప్ప‌టికీ అంద‌రితో సులువుగా క‌లిసిపోయిన‌ ఆమె ప‌ద్నాలుగో వారంలో ఎలిమినేట్ అయి షో నుంచి నిష్క్ర‌మించింది. బ‌య‌ట‌కు రాగానే ఎన్నో ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ బిజీబిజీగా మారింది. ఈ క్ర‌మంలో జోర్దార్ సుజాత‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించింది. 'ఓ వీకెండ్‌లో డీప్ నెక్ డ్రెస్ వేసుకున్నాన‌ని ట్రోల్ చేశారని బాధ‌ప‌డింది. ఆరోజు నా ఆరోగ్యం బాగోలేదు. త‌ల‌కు నూనెతో మేక‌ప్ లేకుండా అలాగే కూర్చున్నాను. క‌నీసం కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు' అని అస‌లు విష‌యాన్ని చెప్పుకొచ్చింది. (మోనాల్ వెళ్లిపోయాక ఊపిరి ఆడలేదు: అఖిల్‌)

త‌న సోద‌రి హేమాలిని కూడా ట్రోల్ చేయ‌డాన్ని ఆమె ప్ర‌స్తావించింది అభి గురించి చెడుగా మాట్లాడ‌క‌పోయినా ఆమెను ఇష్ట‌మొచ్చిన‌ట్లు నిందించార‌ని మండిప‌డింది. 'హేమాలి హౌస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు అభిజిత్‌కు ఓ స‌ల‌హా ఇచ్చింది. నా వెన‌క కాకుండా నాతో నేరుగా మాట్లాడ‌మ‌ని అభికి చెప్పింది. అంత‌కుముందు కొన్నిసార్లు అత‌డు నా వెన‌కాల మాట్లాడాడు కాబ‌ట్టే ఆమె అలా చెప్పింది. అందులో ఏ త‌ప్పూ లేదు. ఒక‌వేళ ఆమె చెప్పే విధానం స్ట్రాంగ్ కావ‌చ్చు. కానీ అభి గురించి చెడుగా ఏం చెప్ప‌లేదు. అయినా స‌రే అభిజిత్ ఫ్యాన్స్ దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తూ సోద‌రిపై నీచంగా కామెంట్లు చేశారు. ఆమెను చంపుతామ‌ని బెదిరించారు. దీని వ‌ల్ల‌ హేమాలి చాలా బాధ ప‌డింది' అని తెలిపింది. అందుకే ఈ విషయాన్ని సీరియ‌స్‌గా తీసుకుని తాను సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు పేర్కొంది. త‌న సోద‌రిని దారుణంగా ట్రోల్ చేసినందుకు అభిజిత్ ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజులే ఉన్న తరుణంలో మోనాల్‌.. అభి ఫ్యాన్స్ మీద కేసు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. (సోహైల్‌ అర్ధ‌రాత్రి అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడు)

(చ‌ద‌వండి: అభిజిత్‌కు క్లాస్ పీకిన‌ మోనాల్ సోద‌రి)

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement