బిగ్‌బాస్‌: నెట్టింట‌ అభి, హారిక ఫ్యాన్స్ ఫైట్‌

Bigg Boss 4 Telugu: Dethadi Fans Request Only Vote For Harika - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ఓటింగ్ ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌, ఇప్పుడొక లెక్క అన్న‌ట్లుగా మారింది. ఇంత‌కుముందు త‌మ అభిమాన‌ కంటెస్టెంట్లు నామినేష‌న్స్‌లో లేక‌పోతే వారికిష్ట‌మైన‌ ఫ్రెండ్స్‌ను సేవ్ చేసే బాధ్య‌త‌ను అభిమానులు వారి భుజాన వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. కేవ‌లం త‌మ‌కిష్ట‌మైన కంటెస్టెంట్ల మీద‌నే ఫోక‌స్ చేస్తున్నారు. ఇదిలా వుంటే హౌస్‌లో ఉన్న ఫైన‌లిస్టుల‌తో బిగ్‌బాస్ "టైటిల్‌ గెలిచేందుకు ఎవ‌రు అన‌ర్హులు?" అని ఓ టాస్క్ ఆడించిన విష‌యం తెలిసిందే క‌దా! ఇందులో అఖిల్‌, హారిక.. అరియానా గెల‌వ‌డానికి అన‌ర్హురాలు అని చెప్పారు. సోహైల్ మాత్రం అభిజిత్‌, అరియానాకు విజేత‌గా నిలిచే అర్హ‌త లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

హారిక‌కు ఝ‌లక్ ఇచ్చిన అభిజిత్‌
అటు అభిజిత్ మాత్రం హారిక అన‌ర్హురాలు కావాల‌ని కోరుకున్నాడు. ఈ ఆట‌లో ఇద్ద‌ర‌మే మిగిలితే అందులో హారిక ఓడిపోవ‌డం ఇష్టం లేద‌ని, అలా అని తాను ఓడిపోలేన‌ని, ఎలాగైనా గెల‌వాల‌ని, అందుకే ఆమె అన‌ర్హురాలుగా మిగిలిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు వివ‌ర‌ణ ఇచ్చాడు. అభిజిత్ ఏం చెప్తున్నాడో అర్థం కాని హారిక కాస్త డ‌ల్ అయిన‌ట్లు అనిపించింది. ఏదేమైనా అభిజిత్ త‌న‌ను అన‌ర్హురాలు అని చెప్ప‌డాన్ని ఆమె మ‌న‌సులో నుంచి తీసేయ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో అభిజిత్‌, హారిక ఫ్యాన్స్ మ‌ద్ద మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. (చ‌ద‌వండి: మోనాల్ మ‌న‌సులో నేనున్నా అంది: అభి)

చీలిపోతున్న అభిక ఓట్లు
ఇప్పుడు కూడా అభిక అంటే కుద‌ర‌ద‌ని వారు వాదిస్తున్నారు. అభిజిత్‌, హారిక‌.. ఇద్ద‌రిలో ఒక‌రికే ఓటేయాల‌ని చెప్తున్నారు. దీంతో అభిక ఫ్యాన్స్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయాయి. ఇందులో మొద‌టి వర్గం.. అభికి మాత్ర‌మే ఓటేయాల‌ని, అభి లేనిదే హారిక లేద‌ని అంటున్నారు. అభి ఫ్యాన్స్ ఆమెను చాలాసార్లు నామినేష‌న్ నుంచి సేవ్ చేశార‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడిక ఫినాలే వీక్‌లో ఆమెకు ఓటేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌తి ఓటు అభికే వేయండ‌ని ఆయ‌న అభిమానులు సూచిస్తున్నారు. పైగా క‌న్ఫెష‌న్ రూమ్‌లో నాగార్జున క్లాస్ పీకిన త‌ర్వాత ఆమె అభిని దూరం పెట్టి అఖిల్‌తో క్లోజ్ అయిందని విమ‌ర్శిస్తున్నారు. (చ‌ద‌వండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి)

అభిక ఫ్యాన్స్ ఓటు ఎటువైపు?
దీనిపై రెండో వ‌ర్గానికి చెందిన‌ హారిక ఫ్యాన్స్ కూడా దీటుగానే స్పందిస్తున్నారు. మా క్యూటీ లేక‌పోతే అభి లేడ‌ని కౌంట‌రిస్తున్నారు. హారిక.. అభిజిత్‌లాగా బ‌ద్ధ‌కంగా టాస్కు చేయ‌కుండా కూర్చోలేద‌ని, అన్నింట్లోనూ త‌న స‌త్తా చూపిస్తూ, ఒంట‌రి పోరాటంతో ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చిందంటున్నారు. అభిజిత్‌ను సేవ్ చేయ‌డం కోసం ఆమెను కెప్టెన్ చేసిన మోనాల్‌ను నామినేష‌న్‌లోకి పంపిన‌ విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. హారిక‌ను త‌క్కువ అంచనా వేయ‌కండ‌ని హెచ్చ‌రిస్తూ, ఆమెకు ఓటేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఏదేమైనా గెలుపును నిర్దేశించ‌డంలో అభిక ఫ్యాన్స్ ఓట్లు కీల‌కంగా మార‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: అభిజిత్‌ను గెలిపించండి: యువ హీరో)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top