బిగ్‌బాస్‌: మాట మీద నిల‌బ‌డ్డ దేవి నాగ‌వ‌ల్లి | Bigg Boss Telugu 4: Devi Nagavalli Supports Ariyana | Sakshi
Sakshi News home page

అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి

Dec 14 2020 5:01 PM | Updated on Dec 14 2020 7:43 PM

Bigg Boss Telugu 4: Devi Nagavalli Supports Ariyana - Sakshi

ఎప్ప‌టిలాగే ఈ సీజ‌న్‌లో కూడా ఓ జ‌ర్న‌లిస్టు ఉండాల‌ని దేవి నాగ‌వ‌ల్లిని బిగ్‌బాస్ హౌస్‌లో దింపారు. ఆమె మాట‌ల్లో ప‌దును, చేత‌ల్లో వేగం చూసి ఇంటిస‌భ్యులే భ‌య‌ప‌డిపోయేవారు. ఇంటి నియ‌మాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బిగ్‌బాస్ క్లాస్ పీకిన‌ప్పుడు అంద‌రూ క్ష‌మించండంటూ లేచి దండాలు పెడుతుంటే ఆమె మాత్రం సోఫాలో నుంచి అంగుళం క‌ద‌ల్లేదు. త‌నే త‌ప్పూ చేయ‌న‌ప్పుడు సారీ చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని అలాగే కూర్చుండిపోయింది. ఇక నామినేష‌న్స్ స‌మ‌యంలోనూ ఆమె త‌న‌మ‌న బేధాలు చూడ‌కుండా ఇంటి స‌భ్యులు చేస్తున్న పొర‌పాట్ల‌ను ముక్కుసూటిగా ప్ర‌స్తావిస్తూ నామినేట్ చేసేది.

ఈసారి అమ్మాయిలే గెల‌వాలి
ఇంటి స‌భ్యుల‌తో పెద్ద‌గా క్లోజ్ అయిన‌ట్లు చూపించ‌క‌పోయినా ఆమె ఎలిమినేట్ అయిన‌ప్పుడు మాత్రం అంద‌రూ గుక్క‌పెట్టి ఏడ్చేశారు. ఆమెను శ‌త్రువుగా అభివ‌ర్ణించిన అమ్మ రాజ‌శేఖ‌ర్ కూడా క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అరియానా అయితే.. దేవి నా అక్క అంటూ బాధ‌తో కూల‌బ‌డిపోయింది. అయితే ఇది జ‌ర‌గ‌డానికి ముందు అరియానా, దేవి నాగ‌వ‌ల్లి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సీజ‌న్ అమ్మాయిల సొంతం కావాల‌ని మాట్లాడుకున్నారు. మ‌న‌లో ఎవ‌రు వెళ్లిపోయినా మిగ‌తా ఒక‌రు గెలిచే బాధ్య‌త తీసుకోవాల‌ని మాట్లాడుకున్నారు. ఒక‌వేళ‌ త‌ను ఎలిమినేట్ అయి వెళ్లిపోయినా దేవి మాత్రం ఎలాగైనా గెల‌వాలంటూ అరియానా వ‌ర్షంలో ఏడ్చేసింది కూడా. కానీ చివ‌ర‌కు మూడో వారంలోనే దేవి ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు. (చ‌ద‌వండి: దేవి నాగ‌వ‌ల్లికి దాస‌రి ద‌గ్గ‌రి బంధువు)

అరియానాను ర‌క్షించుకుందాం..
ఇక అరియానా ఎవ‌రి అండ‌దండ‌లు లేకుండానే హౌస్‌లో ప‌ద్నాలుగు వారాల జర్నీ పూర్తి చేసుకుని ఫైన‌ల్‌కు చేరుకుంది. ఈ స‌మ‌యంలో దేవి నాగ‌వ‌ల్లి ఆమెకు అండ‌గా నిల‌బడింది. ఇచ్చిన మాట ప్ర‌కారం అమ్మాయి విన్న‌ర్ అవ్వాల‌న్న క‌ల‌ను సాకారం చేసేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. అరియానాను గెలిపించాల్సిన‌‌ స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆమెను ర‌క్షించుకుందామంటూ అభిమానుల‌కు పిలుపునిచ్చింది. ఈ ఒక్క పోస్టుతో అరియానా అభిమానులకు కొండంత బ‌లం వ‌చ్చిన‌ట్లైంది. లేడీ ఫైట‌ర్‌కు స‌పోర్ట్ ఇచ్చినందుకు ఆమె అభిమానులు దేవికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు. (చ‌ద‌వండి: హారిక త‌మ‌న్నా, మోనాల్ అనుష్క అంటోన్న‌ అభి)

1
1/1

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement