బిగ్‌బాస్ షోకి విచ్చేయ‌నున్న అనుష్క‌

Bigg Boss 4 Telugu: Anushka Shetty To Enter Into House As A Guest - Sakshi

థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజ్ చేసేముందు చిత్ర‌యూనిట్ హంగామా అంతా ఇంతా కాదు. ప్ర‌చారానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని దారుల‌ను భీభ‌త్సంగా వాడేసుకుంటారు. కానీ క‌రోనా వ‌ల్ల థియేట‌ర్లు తెరుచుకునే దారులు క‌నిపించ‌క‌పోవ‌డంతో చాలా సినిమాలు ఓటీటీ బాట ప‌ట్టాయి. అందులో అగ్ర‌తార అనుష్క సినిమా "నిశ్శ‌బ్ధం" కూడా ఉంది. ఇది అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానుంది. సుమారు రెండేళ్ల త‌ర్వాత చేస్తున్న చిత్రం, అందులోనూ మూగ పెయింట‌ర్‌గా భాగ‌మతి సరికొత్త‌ పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఇంత ప్ర‌త్యేక‌మైన ఈ సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేస్తున్న‌ట్లే క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఓ వార్త అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. 'నిశ్శ‌బ్ధం' చిత్ర‌యూనిట్ బిగ్‌బాస్ షోలోకి అడుగు పెట్టి నానా హంగామా చేయ‌నుంద‌ని రెండు రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై నిశ్శ‌బ్ధం టీమ్ ఏమాత్రం స్పందించ‌కుండా సైలెన్స్ పాటిస్తోంది. (చాలాసార్లు బ‌త‌కాల‌నిపించ‌లేదు: వితికా )

మ‌రోవైపు ఆదివారం నాటి ఎపిసోడ్‌లో స్టేజ్‌పై అనుష్క‌ను చూసి ఇంటిస‌భ్యులు స‌ర్‌ప్రైజ్ అవ‌డం ఖాయ‌మంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. అలాగే నాగ్‌, అనుష్క‌లను ఒకే ఫ్రేములో చూడ‌బోతున్నామ‌ని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం అనుష్క బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంద‌ని చెప్తున్నారు. అదే నిజ‌మైతే తెలుగు బిగ్‌బాస్ చ‌రిత్ర‌లోనే రెండో మ‌హిళా యాంక‌ర్‌గా అనుష్క నిలిచిపోతుంద‌ని స్వీటీ అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. కాగా గ‌త సీజ‌న్‌లో నాగ్ విదేశాల్లో బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటే అప్పుడు అత‌ని స్థానంలో ర‌మ్య‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. కాగా డాన్‌, కింగ్‌, ఢ‌మ‌రుకం వంటి ప‌లు చిత్రాల్లో నాగ్ స‌ర‌స‌న స్వీటీ జోడీ క‌ట్టారు. (అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top