బిగ్‌బాస్ మాయ గురించి చెప్పిన వితికా

Vithika Sheru Spoke About Bigg Boss Reality Show And Trolls - Sakshi

బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌లో జంట‌గా వెళ్లిన వ‌రుణ్ సందేశ్‌, వితికా షెరులు సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. కోపంతో అలిగిన ప్ర‌తిసారీ వ‌రుణ్ ఆమెను బుజ్జ‌గించేవాడు. ఈ జంట‌తోపాటు పున‌ర్న‌వి, రాహుల్ అంతా ఓ గ్యాంగ్‌గా ఉండేవారు. అయితే అక్క‌డి మాట‌లు ఇక్క‌డ చెప్ప‌డం, రాహుల్‌తో గొడ‌వ, అలీ రెజాపై ఆమె చేసిన కామెంట్లు ట్రోలింగ్‌కు కార‌ణ‌మ‌య్యాయి. తాజాగా ఆమె బిగ్‌బాస్ షో గురించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. షోకు వెళ్లేవ‌ర‌కు త‌న‌పై త‌న‌కు చాలా న‌మ్మ‌కం ఉండేద‌ని, కానీ బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ త‌న‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్ చూసి చాలా బాధ‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చింది.

నా మీద నాకే డౌటేసింది
"ఇది రియాలిటీ షో. ఇక్క‌డ ఒక డైరెక్ట‌ర్‌, 500 మంది ప‌ని చేస్తారు. వాళ్ల‌కు కావాల్సిందే చూపిస్తారు. అలా ఎలా చూపిస్తార‌ని మీలాగే నేనూ అనుకున్నా. కానీ త‌ర్వాత న‌న్ను నేను టీవీలో చూసుకున్న‌ప్పుడు ఏంటి ఇలా ఉన్నాన‌నిపించింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాక న‌న్ను విమ‌ర్శిస్తూ చాలా మెసేజ్‌లు వ‌చ్చాయి. విప‌రీతంగా ట్రోలింగ్ చేశారు. చాలాసార్లు బ‌త‌కాల‌నింపించ‌లేదు. ఇప్పుడీ వీడియో చేయ‌డానికి కార‌ణం. సీజ‌న్ 4 ప్రారంభ‌మైంది. క‌నీసం ఈ వీడియోలు చూసేవారు ఒక్క‌రైనా అనుచిత కామెంట్లు చేసేముందు, ట్రోలింగ్ చేసేముందు ఆలోచిస్తార‌ని చిన్న ఆశ. నా కుటుంబం ప‌డిన బాధ వేరొక‌రి ఫ్యామిలీ ప‌డ‌కూడ‌దు. నేను అనుభ‌వించిన వ్య‌ధ వేరొక‌రు అనుభ‌వించ‌కూడదు" అని తెలిపింది. (బిగ్‌బాస్‌లో నా వాయిస్‌, సంతోషంగా ఉంది: నందు)

ఎడిట్ చేసి చూపించారు
"ఒక కంటెస్టెంటు(అలీ రెజా)ను చూస్తూ ఫిజిక‌ల్ టాస్క్ బాగుంది అంటే ఫిజిక్ బాగుంది అని చూపించారు. నేను అన్న‌ది వేరు, వాళ్లు ఎడిట్ చేసి చూపించింది వేరు. కానీ అదే నిజ‌మ‌ని న‌మ్మి "నీకెందుకు వాడంటే అంత కామం" అంటూ ఘోరంగా కామెంట్లు  చేశారు. చాలా ట్రోలింగ్ చేశారు. దాని వ‌ల్ల చాలా వేద‌న అనుభ‌వించాను. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లిరావ‌డం వ‌ల్ల ఎవ‌రేంటో తెలిసింది" అని చెప్పుకొచ్చింది. త‌న‌ను ట్రోల్ చేసిన‌వారి కామెంట్ల‌ను కూడా స్క్రీన్ షాట్లు తీసి వీడియోలో పొందుప‌రిచింది. (టాస్క్‌లో ఓడిన మాస్ట‌ర్‌, రెండో కెప్టెన్‌గా నోయ‌ల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top