స‌పోర్ట్ లేదు, ఫ్రెండ్‌షిప్ పెట్టుకుని వేస్ట్‌: అఖిల్‌ | Bigg Boss 4 Telugu: Akhil Frustrate For Anyone Not Supporting Him | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: ఈ వారం నో కెప్టెన్!

Nov 10 2020 3:46 PM | Updated on Nov 10 2020 5:48 PM

Bigg Boss 4 Telugu: Akhil Frustrate For Anyone Not Supporting Him - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ప‌దో వారంలోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రూపులుగా ఉన్నా టాప్ 5లోకి వెళ్లాలంటే ఒంట‌రిగా పోరాడాల్సిన స‌మ‌యం ఇది. కానీ హౌస్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా గ్రూపులు గ్రూపులుగా ఆడుతున్నారు. ఇక అఖిల్ త‌న‌తో క్లోజ్‌గా ఉండే వాళ్ల‌ను నామినేట్ చేసి షాకిచ్చాడు. ఒంట‌రువుతున్నాన‌ని బాధ‌ప‌డుతున్న అరియానాను అవినాష్ త‌ప్ప మిగ‌తా అంద‌రూ నామినేట్ చేసి ఆమె ఒంట‌రే అని నిరూపించారు. ఇక లాస్య‌, అభిజిత్‌, హారిక ఎలాగో ఒక‌రినొక‌రు నామినేట్ చేసుకోరు. ఈ ప్ర‌క్రియ‌ను ప‌క్క‌న పెడితే నేడు కెప్టెన్సీ పోటీ జ‌ర‌గ‌నుంది. దీనికంటే ముందు కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక జ‌ర‌గాలి క‌దా! అది మీలో మీరే తేల్చుకోమ‌ని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ కోసం ఎవ‌రు త్యాగం చేస్తారు? అని స్టార్ మా తాజాగా ప్రోమోను వ‌దిలింది. (చ‌ద‌వండి: అఖిల్ ప్ర‌వ‌ర్త‌న‌పై మోనాల్ ఫ్యాన్స్ ఫైర్‌)

"ఒక్క‌సారి కూడా ఏ ఒక్క‌రూ త‌న‌కు స‌పోర్ట్ చేయ‌లేదు అని అఖిల్ ఫ్ర‌స్టేట్ అవుతున్నాడు. ఈ స్నేహాలు గ‌ట్రా పెట్టుకునే బ‌దులు దూరంగా ఉండ‌ట‌మే మంచిద"‌ని చెప్పుకొచ్చాడు. మ‌రోవైపు మెహ‌బూబ్ త‌న ద‌రిద్రాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్ర‌తిసారి దేవుడు త‌న‌కు అన్నీ ఇచ్చిన‌ట్టే ఇచ్చి వెన‌క్కు తీసుకుంటున్నాడ‌ని దుఃఖిస్తున్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోతున్న సోహైల్ ఎవ‌రో ఒక‌రు కాంప్ర‌మైజ్ అయితే క‌దా దిల్ అనేది తెలుస్తుంది అని మెహ‌బూబ్‌ను క‌న్విన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అటు మోనాల్ కూడా మెహ‌బూబ్‌ను ఓదార్చే ప‌నిలో ప‌డింది.  అయితే టాస్కు స‌రిగా పూర్తి చేయ‌నందుకో, దేనికో కానీ అస‌లు కెప్టెన్‌గా ఎవ‌రూ ఎన్నిక అవ‌లేద‌ని స‌మాచారం.. (చ‌ద‌వండి: నీ కాళ్లు ప‌ట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా)

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement