అఖిల్ ప్ర‌వ‌ర్త‌న‌పై మోనాల్ ఫ్యాన్స్ ఫైర్‌

Bigg Boss 4 Telugu: Netizens Slam Akhil For Not Gifting To Monal - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్ ప‌రిస్థితి మ‌రీ అధ్వాన్నంగా త‌యారవుతోంది. త‌న‌కు చెరో భుజంలా ఉండే అభిజిత్‌, అఖిల్ ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు. పైకి ఏదో నామ‌మాత్రంగా మాట్లాడుతున్నారే త‌ప్ప మొద‌ట్లో ఉన్నంత క్లోజ్‌గా ఉండ‌టం లేదు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో జ‌రిగిన గొడ‌వ‌ల మూలాన ఇక‌పై మ‌నం క‌లిసి సాగ‌లేమ‌ని అభి ఆమెకు ఇదివ‌ర‌కే ఓ క్లారిటీ ఇచ్చాడు. కానీ అఖిల్ మాత్రం క‌న్ఫ్యూజ్ అవుతూ ఆమెను కూడా క‌న్ఫ్యూజ్ చేస్తున్నాడు. తాను ఆమెతో ఉంటే గేమ్ ఆడ‌టం లేదు. స్ట్రాంగ్ అవ్వాల‌నే నామినేట్ చేశానంటాడు. కానీ మునుప‌టిలా మాట్లాడ‌కుండా దూరంగా ఉంటున్నాడు.

అంద‌రికీ గిఫ్టులు.. మాస్ట‌ర్‌, మోనాల్‌కు త‌ప్ప‌
ఇక టీస్టాండు టాస్కులో ఆమె మీద చ‌ల్ల‌ని నీళ్లు గుమ్మ‌రిస్తూ హింసిస్తుంటే మాత్రం త‌ట్టుకోలేక‌పోయాడు. అస‌లు మోనాల్‌తో నీ రిలేష‌న్ ఏంటని నాగార్జున అడ‌గ్గానే ఠ‌పీమ‌ని స‌మాధాన‌మివ్వ‌కుండా కొన్ని క్ష‌ణాల‌పాటు ఆలోచించి ఫ్రెండ్ చెప్పాడు. ఆమె నెక్స్ట్ వీక్ సేఫ్ అవుతుంద‌ని చెప్తే మ‌రేమీ ఆలోచించ‌కుండా త‌న బ‌ట్ట‌లు, ఇత‌ర వ‌స్తువుల‌ను త్యాగం చేశాడు. ఆమె కోసం ఒంటరిగా పోరాడాడు. ఇది చూసి మోనాల్‌కు ఎవ‌రూ అండ‌గా నిల‌బ‌డ‌క‌పోయినా అఖిల్ ఉన్నాడ‌ని అంద‌రూ సంతోషించారు. కానీ అంత‌లోనే మ‌ళ్లీ ప్లేటు ఫిరాయించాడు. నిన్న ఇంటిస‌భ్యులు ఒక‌రికి మ‌రొక‌రు దీపావ‌ళి గిఫ్టులు ఇచ్చి పుచ్చుకున్నారు క‌దా! మోనాల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు మాత్రం ఎవ‌రూ ఎలాంటి గిఫ్టులు ఇవ్వలేదు. (బిగ్‌బాస్‌ : ఆమెను నామినేట్‌ చేసి షాకిచ్చిన అఖిల్‌)

మోనాల్‌కు అఖిల్ వెన్నుపోటు!
అఖిల్ మాత్రం త‌న‌కు మోనాల్ గిఫ్టుగా ఇచ్చిన చాక్లెట్ల‌ను తీసుకుని మురిసిపోయాడే త‌ప్ప‌ ఆమెకు ఏ బ‌హుమానాన్ని అందించ‌లేదు. దీంతో మోనాల్ మ‌రోసారి బాధ‌ప‌డింది. త‌న‌లోని న‌ర్మ‌ద‌ను బ‌య‌ట‌కు తీసుకు వ‌స్తుండ‌గా నాగ్ మీకునేను గిఫ్టులిస్తానంటూ మోనాల్‌కు స్వీట్లు పంపించాడు. ఈ విష‌యంలో నెటిజ‌న్లు అఖిల్ తీరును ఎండ‌గ‌డుతూ మోనాల్‌పై సానుభూతి కురిపిస్తున్నారు. లాస్య‌కు ఆమె కొడుకు ఫొటోను గిఫ్టిచ్చిన అఖిల్‌.. అదే చేత్తో మోనాల్‌కు ఓ స్వీటు ఇవ్వ‌డానికి ఏమైంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఓవైపు నామినేట్ చేస్తూనే ఆమెకు ఇమ్యూనిటీ వ‌చ్చేందుకు పోరాడటం ఒక చేత్తో పొడిచి మ‌రో చేత్తో బ్యాండేజ్ వేస్తున్నట్లు ఉంద‌ని సెటైర్లు వేస్తున్నారు. ప్ర‌తివారం నామినేట్ అయిన‌ మోనాల్ ఇప్ప‌టికీ హౌస్‌లో ఉందంటే ఆమె స్ట్రాంగ్ కాదా? అని ఆమె అభిమానులు అఖిల్‌ను నిల‌దీస్తున్నారు. త‌న‌ను ఎవ‌రూ నామినేట్ చేయ‌కూడ‌ద‌నే మిగ‌తావాళ్ల‌తో క‌లిసిపోతూ మోనాల్‌ను ప‌క్క‌న పెట్టేశాడ‌ని విమ‌ర్శిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top