Bigg Boss Fame Shiva Jyothi And Her Husband Gets Trolled - Sakshi
Sakshi News home page

Shiva Jyothi: అక్కా పిల్లల్ని ఎప్పుడు కంటారంటూ శివ జ్యోతి భర్తపై దారుణమైన కామెంట్లు

Jul 22 2023 8:19 AM | Updated on Sep 6 2023 10:18 AM

Big Boss Siva Jyothi And Husband Faced Trolling - Sakshi

యాంకర్‌ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని టాప్‌ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్‌ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్‌ చేస్తుంటుంది.

(ఇదీ చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్‌ ఇంత తక్కువనా..?)

అయితే తాజాగా బోనాల పండుగ సందర్భంగా ఆమె ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. అందులో తన కోసం భర్త గంగూలీ కొన్న బంగారు నగలను చూపించింది. దీంతో  జ్యోతి భర్త గంగూలీపై నెటిజన్లు దారుణమైన కామెంట్స్‌ చేశారు. అక్క మీ భర్త ఏం జాబ్ చేస్తారని ఒకరు కామెంట్‌ చేయగా.. మరోకరు ఏ జాబ్‌ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడని కామెంట్‌ చేశారు. అంతటితో ఆగని కొందరు ఇంతకూ మీరెప్పుడు పిల్లల్ని కంటారని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వారి మాటలను పట్టించుకోకూడదని శివజ్యోతికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట  గ్రామానికి చెందిన జ్యోతి.. ప్రేమించి గంగూలీని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తన జీవితం ప్రారంభంలో గంగూలీ జాబ్‌ చేసేవాడని కూడా చెప్పింది. కానీ ఒక న్యూస్‌ యాంకర్‌గా జర్నీ ప్రారంభించిన శివజ్యోతికి బిగ్‌బాస్‌ తర్వాత పలు టీవీ షోలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఆపై వారు సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానల్‌ క్రియేట్‌ చేసుకుని వ్లాగ్స్‌ చేస్తూ బిజీగా ఉన్నారు.  

తనకు ఇంతగా గుర్తింపు రావడానికి కారణం తన భర్తేనని, మొదట్లో ఈ కెరీర్‌ను ఎంచుకున్నప్పుడు భర్త గంగూలీ ప్రోత్సహం ఎక్కువ ఉందని గతంలో జ్యోతి చెప్పింది. బిగ్‌బాస్‌ షో తర్వాత వీరిద్దరి జంట బాగా పాపులర్‌ అయింది. తర్వాత ఇద్దరూ కలిసే పలు షోలు కూడా చేశారు. దీంతో అతను జాబ్‌ మానేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జ్యోతితో పాటు అటూ టీవీ షోలు, తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌ వీడియోలకు సంబంధించి ఎడిటింగ్‌ పనులను తనే చూసుకుంటున్నట్లు కూడా తెలిసిందే.

తన ప్రెగ్నెన్సీ గురించి గతంలో  జ్యోతి ఇలా చెప్పింది  'మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్‌ చేస్తున్నా. ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. నాపై పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా తప్పుగా ప్రచారం చేయకండి. అది నాపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తుంది.' అని ఆమె  చెప్పింది. 

బిగ్‌బాస్‌లో చిన్నచిన్న విషయాలకే ఎమోషనల్‌ అయ్యే శివజ్యోతికి తనకూ తల్లి కావాలనే ఎమోషన్‌ ఉండదా. అందులో వారి తప్పేముంది..? రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కానీ సంతానం కలగలేదా అంటూ తనకు సపోర్టుగా పలువురు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement